వీడియో: అదిరిపోయే సీ-వ్యూలో పూల్ సైడ్ మగువ కవ్వింత గిలిగింతలే!

Sun Sep 12 2021 23:00:02 GMT+0530 (IST)

sarah jane dias Instagram video

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన `పంజా` సినిమాలో నటించింది సారా జేన్ డయాస్. ఆ సినిమా పరాజయం నిరాశపరిచింది. అంతకు ముందు కోలీవుడ్ లో విశాల్ సరసన ఓ  చిత్రంలో నటించింది. `పంజా` సినిమాకు తమిళ దర్శకుడు  విష్ణు వర్ధన్ పనిచేసారు. ఆ కారణంగా  సదరు దర్శకుడు విష్ణునే `పంజా`కు ఎంపిక చేసారు. ఆ తర్వాత సారాకు తెలుగులో ఆఫర్లు లేవు. ఆ క్రమంలోనే బాలీవుడ్ లో నటించింది.కోహ్లీతో ప్రేమాయణం వేడెక్కించింది!

ఉత్తరాది భామ సారా జేన్  టీమిండియా కెప్టెన్ విరాట్ కి స్నేహితురాలు.

టీమ్ ఇండియా కెప్టెన్  విరాట్ కొహ్లీ- అనుష్క శర్మలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. సారా జేన్ తో విరాట్ లింకప్ వార్తలు వైరల్ అయ్యాయి. అనుష్కతో ప్రేమాయణానికి ముందే విరాట్ కి సారా గాళ్ ఫ్రెండ్ అన్న ప్రచారం ఉంది. అనుష్క శర్మతో ప్రేమాయణం విరాట్ క్రికెటర్ గా బిజీ అయిన తర్వాత ప్రారంభమైంది. కానీ అంతకు ముందు టీమ్ ఇండియాకు సెలక్ట్ అయినప్పుడే విరాట్ కథానాయికలతో చాటుమాటు వ్యవహరాలు నెరిపారని కథనాలొచ్చాయి. ఫెమినా మిస్ ఇండియా 2007 విజేత సారా జేన్ డయాస్ తోన డీప్ లవ్ లో మునిగి తేలాడని ముంబై మీడియా కథనాలు అల్లింది.

ఇద్దరు కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసినట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియా  హీటెక్కించింది. ఈ విషయంపై బహిరంగంగా ఏనాడూ వెల్లడించకపోయినా.. జంటగా కలిసి తిరుగుతున్నారనే కథనాలు అప్పట్లో ఆసక్తికరంగా మారాయి. అయితే ఈ రిలేషన్ షిప్ గురించి విరాట్ పెళ్లైన తర్వాత సారా స్పందించింది.

అయితే తాము ఇద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని.. ఇద్దరు ఒకే గదిలో కలిసి జీవించలేదని కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించింది. అనుష్కను రెండుసార్లు కలిసాను. మా ఇద్దరి గురించి ఈ వార్త ఎలా పుట్టిందో అర్ధం కాలేదు. ఇదే విషయాన్ని నా కుటుంబ సబ్యులు.. నా తండ్రి కూడా అడిగారు. కానీ లేని విషయాన్ని ఉన్నదని ఎలా చెప్పగలను. అందుకే మా మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని చెప్పినట్లు సారా జేన్ డయాస్ తెలిపింది.

పూల్ సైడ్ ట్రీట్ అదరహో..

ఇక కెరీర్ పరంగా ఆశించినంత దూకుడు లేదు కాబట్టి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేస్తూ సారా జేన్ వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఇన్ స్టాలో హీటెక్కించే ఫోటోలను వీడియలను షేర్ చేసి ఫాలోయింగ్ పెంచుకుంది. ఇందులో బికినీ సిరీస్ వేడెక్కిస్తోంది. తాజాగా ఫ్లోరల్ బికినీలో అలా పూల్ లోకి దిగుతూ అభిమానుల్లో మంటలు పుట్టించిన వీడియో వైరల్ గా మారింది. బీచ్ పరిసరాల్లో అందమైన వ్యూ నడుమ పూల్ అదిరిపోయింది. అంతకుమించి మగువ కవ్వింత గిలిగింతలు పెడుతోంది.