#స్టార్ వైబ్స్.. ధడ పుట్టిస్తున్న సారా టెండూల్కర్

Tue Jul 05 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

sara tendulkar latest lipstck ad

క్రికెట్- సినిమా జోడు గుర్రాలు. సినీప్రపంచంతో మమైకం అయ్యే వారసుల్లో క్రీడా వారసత్వం గురించి చెప్పాల్సిన పని లేదు. బ్యాడ్మింటన్ స్టార్ ప్రకాష్ పదుకొనే వారసురాలిగా బ్యాడ్మింటన్ నేషనల్ లెవల్ ఛాంపియన్ షిప్ ఆడిన ఘనత దీపిక పదుకొనే సొంతం. కానీ సచిన్ టెండూల్కర్ వారసురాలు సారా టెండూల్కర్ అందుకు పూర్తి భిన్నం. సారా ప్రస్తుతం టాప్ మోడల్ గా రాణిస్తోంది. సినీప్రపంచంపై మక్కువ పెంచుకుని స్టార్ గా వెలగాలనుకుంటోందన్న గుసగుస వినిపిస్తోంది.సారా అందం .. నవ్వు.. చురుకుదనం ప్రతిదీ యూత్ ని ఆకర్షించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. ఇక మోడల్ గా రాణించే క్రమంలో నటిగా అవకాశాలు వెతుక్కుంటూ రావడం సహజం. అయితే సారా కుటుంబం నుంచి ఆ ఒక్క ప్రకటన రావాల్సి ఉంది. చూస్తుండగానే వన్ ఫైన్ డే బాలీవుడ్ లో నటిగా డెబ్యూ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చా నెటిజనులలో సాగుతోంది. అమితాబ్ బచ్చన్ కుటుంబంతో ఖాన్ ల ఫ్యామిలీస్ తో సత్సంబంధాలు కొనసాగించే సచిన్ కుటుంబం నుంచి సారా వారసురాలిగా వస్తోంది కాబట్టి హిందీ చిత్రపరిశ్రమ రెడ్ కార్పెట్ వేయడానికి సిద్ధం. కానీ సారా ఎంపిక ఏది? అన్నదానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.

సారా టెండూల్కర్ ఇప్పటికే వాణిజ్య ప్రకటనల రంగంలో స్టార్ గా వెలుగుతోంది. ఫ్రేమ్ లో తను కనిపిస్తే చాలు ఆ బ్రాండ్ వెలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఓ ప్రమోషనల్ యాడ్ షూట్ లో మరో ఇద్దరు మోడల్స్ తో కలిసి సారా క్యాట్ వాక్ చేసింది. ఓ పాపులర్  దుస్తుల కంపెనీ  యాడ్ లో నటించింది. నటి బానిటా సంధు.. తానియా ష్రాప్ లతో కలిసి మోదటిసారి సారా కెమెరా ముందుకొచ్చింది. వెలుగులు విరజిమ్మింది. ఆ ప్రకటనలో సారా చాలా ప్రోఫెషనల్ లుక్ తో కనిపిస్తుంది. అనుభవం ఉన్న  మోడల్ లా మెప్పించింది. దానికి సంబంధించిన వీడియోని సారా తన ఇన్  స్టా ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది.

తాజాగా మరో వాణిజ్య ప్రకటనతో మతులు చెడగొట్టింది. ఈసారి ప్రఖ్యాత బ్రాండెడ్ లిప్ స్టిక్ కంపెనీకి ప్రమోషన్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. సారాతో పాటు కొందరు మోడల్స్ ఈ ప్రకటనలో కనిపించగా అందరిలోనూ సారా టెండూల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. #స్టార్ వైబ్స్ తో సారా మెరిసిపోతోందంటూ ఈ ప్రకటన చూసిన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సారాకి ఇన్ స్టాలో అసాధారణ ఫాలోయింగ్ ఉంది. 1.5 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉంది. సారా ఫ్యాషన్ ఎంపికలైపై నెటిజనులు ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూనే ఉన్నారు. నిరంతరం ఫిట్ నెస్ వీడియోలు... ఫోటోలతో ఈ బ్యూటీ ఆకట్టుకుంటోంది. మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడంతో సారా బాలీవుడ్ ఎంట్రీకి సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోందని ఫ్యాన్స్ ప్రతిసారీ విషెస్ తెలియజేస్తున్నారు.

తండ్రి సచిన్  క్రికెటర్ గాడ్ గా మన్ననలు అందుకోగా సారా మోడలింగ్ రంగంపై ఆసక్తిని కనబరచడం సర్వత్రా ఆసక్తిని పెంచేదే. ప్రస్తుతం సచిన్ తన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ని ఫాస్ట్ బౌలర్ గా తీర్చిదిద్దుతున్నారు.  ఇక కుమార్తెని నటిగా చూడాలనుకుంటున్నారు. అందుకే ముందుగా మోడలింగ్ రంగంలోకి అవకాశం కల్పించారన్న టాక్ ఉంది. ఇక్కడ నుంచి నేరుగా బాలీవుడ్ కి ప్రమోట్ అవుతుంది.  అక్కడ సక్సెస్ అయితే పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతుంది. సచిన్ కి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి సారా కి ఆ క్రేజ్ పెద్ద అస్సెట్ అవుతుందనడంలో సందేహం లేదు.