రామ్ డాన్స్ చూసినప్పుడల్లా నేను చాలా ఫీలవుతుంటాను!

Mon Mar 01 2021 12:00:01 GMT+0530 (IST)

sandeep kishan Speech At A1 Express Pre Release Event

సందీప్ కిషన్ కథానాయకుడిగా 'A1 ఎక్స్ ప్రెస్' సినిమా నిర్మితమైంది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ముఖ్య అతిథిగా రామ్ రాగా లేత శనగపిండి రంగు చీరలో లావణ్య త్రిపాఠి మెరిసింది. ఈ వేదికపై సందీప్ కిషన్ మాట్లాడుతూ .. "కోవిడ్ తరువాత ఇలాంటి ఈవెంట్ ఒకటి చేస్తానని అనుకోలేదు. కోవిడ్ పరిస్థితుల్లో తెలుగు సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు నిజంగా చాలా గ్రేట్. మీరు ఇస్తున్న ఎనర్జీ మాములుగా లేదు. అందుకు ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ముందుగా ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన రామ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగానే రామ్ బయటికి పెద్దగా రాడు. రామ్ ను పిలవాలని అనుకున్నప్పుడే వస్తాడా? .. రాడా? అనే డౌట్ మాకు వచ్చింది. కానీ ట్రై చేసి చూద్దాం అని అనుకున్నాం. రామ్ వచ్చాడు .. చాలా హ్యాపీగా ఉంది. ఆయన సినిమాలను నేను తప్పకుండా చూస్తుంటాను. రామ్ డాన్సులు చూసిన ప్రతిసారీ నేను చాలా ఫీలవుతాను. ఏంటి మనవాడు అసలు ఆగడం లేదే అని అనుకుంటూ ఉంటాను. ఆయనలా డాన్స్ చేయడానికి ట్రై చేస్తాను.

ఈ సినిమా నిర్మాతలకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఇలాంటి నిర్మాతలు బాగుంటే చాలామంది ఆర్టిస్టులు .. టెక్నీషియన్స్ బాగుంటారు. నేను ఈ సినిమా చేద్దామని అనగానే ఈ నిర్మాతలు ఒప్పుకోవడంతోనే నా జీవితం మారిపోయింది. అవకాశాలు రావు .. మనమే సృష్టించుకోవాలి. అలా సృష్టించుకున్నప్పుడు అండగా ఉన్నవాళ్లే గొప్పవాళ్లు. ఇక నాతో పాటు లావణ్య చాలా కష్టపడింది. కేరవాన్ లో కాకుండా మా మధ్యలోనే ఉంటూ డైరెక్షన్ డిపార్టుమెంటులో ఓ మనిషిలా పనిచేసింది. సినిమా చాలా బాగా వచ్చింది .. థియేటర్ కి వెళ్లి చూడండి" అని చెప్పుకొచ్చాడు.