సమంత పంచ్ పవర్ కి పడుకోవాల్సిందే!

Sat May 14 2022 14:14:01 GMT+0530 (IST)

samantha new boxing photo

సమంత మంచి ఫిట్ నెస్ ప్రియురాలి. డైలీ లైఫ్ లో  కొంత సమయాన్ని జిమ్ కి కేటాయిస్తుంది. చెమటలు కక్కుతూ వర్కౌట్లు చేస్తుంది. లుక్ ఛేంజోవర్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ అనిపించుకోవడం కోసం శ్రమిస్తుంది.   ఈ విషయాన్ని సమంత స్వయంగా ఓ సందర్భంలో రివీల్ చేసింది.``నేను బరువులు ఎక్కువగా ఎత్తుతాను. అలాగని యానిమల్ ప్రొటీన్ తీసుకోను. వెజిటబుల్స్ తీసుకుంటా.. పచ్చదనం(గ్రీన్) నిండిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతాను. మోర్నింగ్ రొటీన్ ప్రొటీన్ షేక్స్ తీసుకుంటాను. వీటితో పాటే నిరంతరం నీళ్లు తాగుతాను అని టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు. జిమ్ కి వెళ్లే ముందు.. గుడ్డు బట్టర్ వంటివి పరిమితంగా తింటానని`` వెల్లడించారు.

ఇక జిమ్ కి బ్రేక్ ఇచ్చి అప్పుడప్పుడు యోగా క్లాస్ లకి హాజరవుతుంది. మనసు ప్రశాంతత కోసం యోగా...ధ్యానంలో మునిగిపోతుంది. ఆ సమయంలో కూడా ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతుంది. నాన్ వెజ్  ప్రియురాలు అయినా ఫిట్ నెస్ ప్రీక్ అనిపించుకోవాలంటే నోరు కట్టుకోత తప్పదుగా. అలా వాటికి  బ్రేక్ ఇస్తుంటుంది.

తాజాగా సమంత కొత్త ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో సమంత జిమ్ లో బాక్సింగ్ గాళ్   లుక్ లో కనిపిస్తుంది. టైట్ ఫిట్ దుస్తులు ధరించి చేతులకు గ్లౌసస్ ధరించి టార్గెట్ ని ఫిక్స్ చేసి పంచ్ పవర్ విసరడానికి పోజిషన్ లో నిలబడి ఉంది. చేతలు రెండు టైట్ చేసి వేళ్లని పిడికిలో మడిచి  పంచ్ ఇవ్వబోతుంది.

ఈ క్రమంలో సమంత చేతి కండరాలు గట్టి పడటాన్ని గమనించ వచ్చు. ఈ ఫోటోని ఉద్దేశించి `ఫైట్ మోడ్` అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుఈ ఫోటో సమంత అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. బ్యాకెండ్ లో వాల్ కి ఇద్దరు ఫిట్ నెస్ మాయగాళ్ల ఫోటో ప్రేమ్ లో చూడొచ్చు. బహుహా సమంత ఇంతగా శ్రమించడానికి వాళ్లిద్దరే కారణం కావొచ్చు.

సమంత నటిస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. `యశోద` అనే లేవీ ఓరియేంటెడ్ మూవీలో నటిస్తోంది.  ఇదొక సస్పెన్స్  థ్రిల్లర్ స్టోరీ. హరి శంకర్-హరీష్ అనే  ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. తెలుగు..తమిళ్ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో ఉన్ని ముకుందన్.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే సమంత నటిస్తోన్న మరో లేడీ ఓరియేంటెడ్ చిత్రం `శాకుంతలం`. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో ఓ సినిమా చేస్తుంది.