Begin typing your search above and press return to search.

ఇప్పుడు సల్మాన్ సినిమాలో షారుఖ్.. గేట్ రెడీ!

By:  Tupaki Desk   |   7 Feb 2023 7:00 AM GMT
ఇప్పుడు సల్మాన్ సినిమాలో షారుఖ్.. గేట్ రెడీ!
X
షారుక్‌ ఖాన్, దీపికాపదుకొణె జంటగా తెరెకెక్కిన చిత్రం పఠాన్‌ ఇప్పటివరకూ రూ.729కోట్ల గ్రాస్‌ రాబట్టింది. పదిరోజుల్లోనే పఠాన్‌ సినిమా అత్యధిక వసూళ్లని సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.

దీంతో చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుక్ కు పఠాన్ రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఇచ్చింది. తొలి రోజు నుంచి మంచి వసూళ్ల మోత మోగిస్తూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. విడుదలై పది రోజులైనా ఈ సినిమా జోరు తగ్గలేదు. దీని ధాటికి కొన్ని సినిమాలు వాయిదా కూడా వేసుకోవాల్సి వచ్చింది.

మరి ఇలాంటి విజయాన్ని అందించినందుకు దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, నిర్మాత ఆదిత్య చోప్రాలతో పాటు చిత్రంలో కేమియో రోల్ చేసిన సల్మాన్ ఖాన్‌కు కూడా షారుక్ రుణపడి ఉండాలి. సిద్దార్థ్, ఆదిత్య ఎంతో ప్లాన్ చేసి సుదీర్ఘ సమయం కష్టపడి ఈ సినిమా తెరకెక్కించారు.

ఇక సల్మాన్ అయితే పఠాన్ మూవీకే హైలైట్ గా నిలిచాడు. సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. నిజానికి ప్రేక్షకులను యాక్షన్ సీన్స్ తో పాటు అమితంగా ఆకట్టుకున్నది షారుక్-సల్మాన్ కలయికలో వచ్చే ఫన్నీ యాక్షన్ ఎపిసోడే. అయితే ఈ ఎపిసోడ్ చివర్లో నేను కష్టాల్లో ఉన్నపుడు కూడా నువ్వు రావాలి అని సల్మాన్ డైలాగ్.

ఈ డైలాగ్‌తో పరోక్షంగా తన టైగర్-3 సినిమాలో షారుక్ క్యామియో రోల్ లో నటించాలని చెప్పకనే చెప్పినట్లయింది. అసలే యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఇప్పటికే కొన్ని స్పై యాక్షన్ సినిమాలు వచ్చాయి. అందులో రెండు సల్మాన్ నటించినవే. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై‌ పేరుతో తెరకెక్కిన ఆ చిత్రాలకు త్వరలోనే కొనసాగింపుగా టైగర్-3 రాబోతోంది. అది ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. కాబట్టి టైగర్ 3 లో షారుక్ కూడా కనిపించే అవకాశం ఉంది.

 ఇకపోతే షారుక్, సల్మాన్ ఒకరి సినిమాల్లో ఒకరు అతిధి పాత్రల్లో మెరవడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆ ఒరవడిని కొనసాగిస్తూ పఠాన్లో మెరిశాడు సల్మాన్. అది బాగా వర్కవుట్ అయింది. ఇక షారుక్ కూడా తనవంతుగా టైగర్-3లో కనిపించి హైలైట్‌గా నిలుస్తాడా లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.