Begin typing your search above and press return to search.

వెన్నెల గా మారడం నిజంగా నా అదృష్టం

By:  Tupaki Desk   |   2 July 2022 2:30 AM GMT
వెన్నెల గా మారడం నిజంగా నా అదృష్టం
X
సాయి పల్లవి.. రానా కీలక పాత్రల్లో నటించిన విరాటపర్వం ఇటీవలే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. చూసిన ప్రేక్షకులు చాలా పాజిటివ్‌ గా స్పందించారు.

కాని కమర్షియల్ సినిమా కాదు అనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో విరాటపర్వం సినిమా కు కమర్షియల్‌ హిట్ దక్కలేదు. బ్రేక్ ఈవెన్ కు కనీసం దరిదాపుకు కూడా వెళ్లలేక పోయిన విరాటపర్వం సినిమాను మరీ ఆలస్యం చేయకుండా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.

నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ చేస్తు ఉన్న విరాటపర్వం ను అత్యధికులు చూస్తున్నారు. సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు సోషల్‌ మీడియా ద్వారా మీరు వెన్నెల జర్నీ చూస్తున్నారా అంటూ పోస్ట్‌ చేశారు. హీరోయిన్ సాయి పల్లవి కూడా విరాటపర్వం ఓటీటీ స్ట్రీమింగ్‌ గురించి సోషల్‌ మీడియా ద్వారా జనాలకు మరియు నెటిజన్స్ కు తెలియజేస్తూ కాస్త ఎమోషనల్‌ అయ్యింది.

విరాటపర్వం సినిమా ను.. సినిమాలోని వెన్నెల పాత్ర ను ఎప్పటికి మర్చి పోలేను. వెన్నెల పాత్రలో నటించడం అనేది నా అదృష్టం. సినిమా కోసం వెన్నెలగా మారడంను జీవితంలో మర్చిపోలేను. వెన్నెల పాత్రకు సహకరించిన దర్శకుడు వేణు ఉడుగుల.. హీరో రానా ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులకు సాయి పల్లవి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ రోజు నుండి వెన్నల జర్నీ విరాటపర్వం నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. వెన్నెల ప్రయాణం ను మీ అందరు చూసి ఆనందిస్తే నేను మరింతగా ఆనందిస్తాను అంటూ సాయి పల్లవి సోషల్‌ మీడియా ద్వారా పేర్కొంది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ప్రేమ కథా చిత్రం విరాటపర్వం. ఉద్యమాన్ని ప్రేమించే వ్యక్తిని ప్రేమించిన వెన్నెల తన ప్రేమను దక్కించుకోవడం కోసం పడ్డ కష్టం.. ఎదుర్కొన్న కష్టాలను సినిమా లో అద్బుతంగా కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చూపించాడు.

సాయి పల్లవి తన నటనతో వెన్నెల పాత్రకు జీవం పోషించినట్లుగా నటించగా.. రానా తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లుగా నటించాడు. 1980 కాలంలో పరిస్థితులను అద్బుతంగా కళ్లకు కట్టినట్లుగా చూపించిన దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్షన్‌ కు మంచి మార్కులు పడ్డాయి.