జయంత్.. ఈ పేరును గుర్తుంచుకోండి

Sun Dec 04 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

sai dharam tej comments about jayanth director

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా యొక్క విడుదలకు ముందు యాక్సిడెంట్ కు గురి అవ్వడంతో తదుపరి సినిమాకు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ తో వినోదయ్య సిత్తం రీమేక్ లో నటించబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ముందు ముందు ఉంటుందా లేదో కూడా క్లారిటీ లేదు.తేజ్ ఎట్టకేలకు తన కొత్త సినిమా ను అధికారికంగా ప్రకటించాడు. పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న కారణంగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమాలు చేసేందుకు చాలా మంది పాత దర్శకులు.. ట్యాలెంటెడ్ పాత దర్శకులు ఆసక్తిగా ఉన్నారు. కానీ ఎందుకు కొత్త దర్శకుడు జయంత్ తో వర్క్ చేసేందుకు సిద్ధం అయ్యారు అంటూ కొందరిలో ప్రశ్న తలెత్తుతుంది.

తాజాగా అదే ప్రశ్నను సాయి దరమ్ తేజ్ ముందు ఉంచగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. కొత్తలో నేను కూడా కొత్తే కదా.. కొత్త అయినంత మాత్రాన వారిలో ప్రతిభ లేదు అనడానికి లేదు. ఈ సినిమా దర్శకుడి పేరు జయంత్.. ఈ పేరును గుర్తు పెట్టుకోండి. భవిష్యత్తులో బాగా పాపుల్ అయ్యే పేరు అన్నట్లుగా సాయి ధరమ్ తేజ్ సమాధానం చెప్పాడు. ఈ సినిమా పై మరియు దర్శకుడిపై సాయి ధరమ్ తేజ్ కు ఉన్న సాక్ష్యంకు ఇదే నిదర్శణం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.