వీడియో : అంతా హాలీడే లో ఉన్నా రౌడీ మాత్రం బిజీ

Sun Jan 16 2022 14:00:01 GMT+0530 (IST)

rowdy is busy even though everything is on holiday

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న లైగర్ సినిమా చిత్రీకరణ కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ విషయం తెల్సిందే. చిత్ర యూనిట్ సభ్యులను రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక షూటింగ్ ను వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాతల్లో ఒక్కరైన ఛార్మి ప్రకటించారు. విజయ్ దేవరకొండ మరియు పూరిల కాంబోలో రూపొందుతున్న లైగర్ సినిమా లో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. కనుక సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా లైగర్ కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడుతున్నాడు.లైగర్ కోసం జుట్టు చాలా నెలలుగా పెంచుతూనే ఉన్నాడు. పొడవాటి జుట్టుతో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. ఇక లైగర్ లో బాక్సర్ గా సిక్స్ ప్యాక్ తో కనిపించేందుకు ప్రతి రోజు గంటల కొద్ది జిమ్ చేస్తున్నాడట. ఇదే ఫిజిక్ ను మెయింటెన్ చేయాలంటే ఖచ్చితంగా రెగ్యులర్ జిమ్ మరియు ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. పండుగ అయినా.. మరేదైనా కూడా బాడీ విషయంలో ఏమాత్రం అశ్రద్దను విజయ్ దేవరకొండ కనబర్చడు అంటూ ఈ వీడియో తో క్లారిటీ వచ్చింది. జిమ్ లో విజయ్ దేవరకొండ వర్కౌట్ చేస్తున్నాడు. అయితే జిమ్ లో ఏ ఒక్కరు కూడా కనిపించడం లేదు.

సినిమా మొత్తం హాలీడే లో ఉంది.. అందుకే జిమ్ ఖాళీగా ఉంది. అయితే ఒక్కరు మాత్రం వర్కౌట్స్ కంటిన్యూ చేస్తున్నారు అంటూ విజయ్ దేవరకొండకు సంబంధించిన ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వైరల్ వీడియో కు విజయ్ దేవరకొండ అభిమానులు ఫిదా అవుతున్నారు. సినిమా కోసం ఇంతగా కష్టపడుతారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ సాదారనంగానే యూత్ లో ముఖ్యంగా అమ్మాయిలో మంచి ఫాలోయింగ్ ను కలిగి ఉంటాడు. లైగర్ సినిమా కోసం ఆయన పెంచుతున్న ఫిజిక్ ను చూసి అమ్మాయిలు పడి చస్తారేమో అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.