Begin typing your search above and press return to search.

తనిష్క్​ యాడ్​ పై రీచా సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట్లో తీవ్ర విమర్శలు

By:  Tupaki Desk   |   19 Oct 2020 8:10 AM GMT
తనిష్క్​ యాడ్​ పై రీచా సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట్లో తీవ్ర విమర్శలు
X
ఇటీవల తనిష్క్​ చేసిన ఓ యాడ్​ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఓ మూస్లింను ప్రేమించిన హిందూ యువతి.. ఆ ఇంట్లో సీమంతం వేడుక జరుపుకుంటున్నట్టు ఈ యాడ్​ ను చిత్రీకరించారు. అయితే ఈ యాడ్​ పై తీవ్ర వివాదం చెలరేగింది. హిందూసంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ‘లవ్​జీహాది’ ని ప్రేరేపించేలా ఈ యాడ్​ ను రూపొందించారని.. సోషల్ మీడియాలో తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో తనిష్క్​ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యాడ్​ ను తొలిగించింది. అయితే ఇంత వివాదం జరిగాక బాలీవుడ్​ నటి రిచా చ‌ద్దా ఈ యాడ్​ చాలా బాగుందంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్​ మీడియా లో తీవ్ర వివాదం రేపాయి. నిజానికి రీచా న‌టులు అలీ ఫ‌జ‌ల్‌ లో 2015 నుంచి సహజీవనం చేస్తున్నది. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ కరోనా లాక్​ డౌన్​ తో పెళ్లికి బ్రేక్​ పడింది. అయితే వీరిది మతాంతర వివాహం అయినప్పటికీ ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు. ఈ క్రమం లో రిచా వ్యాఖ్యలు సంచలనం గా మారాయి.

‘తనిష్క్​ తీసుకొచ్చిన యాడ్​ చాలా బాగుంది. అందులో నా జీవితం ప్ర‌తిబింబిస్తోంద‌న్నారు. అలీ నుంచి, అత‌డి కుటుంబం నుంచి నేను ఎంతో ప్రేమ‌ను పొందుతున్నాను. కానీ కొంతమందికి నిరంతరం ప‌క్క‌వాళ్లు జీవితం గురించే కావాలి. పక్కవాళ్ల పెళ్లిళ్ల గురించి ఇంతలా ఫీలయ్యేవాళ్లేను చూస్తుంటే నిజంగా జాలేస్తోంది’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కాగా రీచా వ్యాఖ్యలపై సోషల్​మీడియాలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. రీచా వ్యాఖ్యలను పలువురు సాంప్రదాయ వాదులు తప్పుపడుతున్నారు. హిందూ మతాన్ని, సాంప్రదాయాన్ని ఆమె కించ పరుస్తున్నదని వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.