ఫోటోటాక్ : నిలువెత్తు అందగత్తె అదరహో

Fri Jul 01 2022 08:00:01 GMT+0530 (IST)

regina latest photo

తెలుగు ప్రేక్షకులకు ఎస్ ఎం ఎస్ సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ రెజీనా. ఈ అమ్మడు తక్కువ సమయంలోనే బ్యాక్ టు బ్యాక్ చిన్నా మీడియం రేంజ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు ను దక్కించుకుంది.హీరోయిన్ గా తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా నటిస్తూ దాదాపు పుష్కర కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రెజీనా ఇప్పటికి కూడా పలు సినిమాల్లో నటిస్తూ ఉంది.

ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న పలు సినిమాలు చర్చల దశలో.. కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్ లో కనిపించడం.. ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కూడా తగ్గేదే లే అన్నట్లుగా అందాల ఆరబోత చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది.

తాజాగా రెజీనా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద ఎత్తున అందాల ఆరబోత చేయకున్నా కూడా నిలువెత్తు అందం అనిపించేలా బాటమ్ యాంగిల్ ద్వారా ఈ అమ్మడి అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ కొంటగా చూస్తున్న రెజీనా అందం ను చూసి ప్రతి ఒక్కరు కూడా అదరహో అనకుండా ఉండలేరు అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

ఇటీవలే మెగాస్టార్ సినిమా లో ఐటెం సాంగ్ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఐటెం సాంగ్స్ ను చేసేందుకు సిద్దం అన్నట్లుగా ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ తో అలరించే ముద్దుగుమ్మ రెజీనా స్టార్ హీరోలకు జోడీగా హీరోయిన్ గా నటించే అవకాశాలు మాత్రం ఇప్పటి వరకు దక్కించుకోలేక పోయింది. ఆ ఆఫర్లు రాకపోవడంతో స్టార్ హీరోయిన్ గా మాత్రం ఈ అమ్మడు గుర్తింపు దక్కించుకోలేక పోయింది.