Begin typing your search above and press return to search.

ఎర్ర మిర్చి రెడ్ ఫ్లేమ్ అంటూ యాంక‌ర్ వెంట ‌ప‌డ్డారు!

By:  Tupaki Desk   |   6 March 2021 11:30 PM GMT
ఎర్ర మిర్చి రెడ్ ఫ్లేమ్ అంటూ యాంక‌ర్ వెంట ‌ప‌డ్డారు!
X
ఇంట‌ర్నెట్ లో నిప్పు పెట్టే క‌ళను అరుదైన‌ క‌ళ‌గా భావిస్తున్నారు నేటి సెల‌బ్రిటీలు. ఎంత‌గా మంట‌లు పెడితే అంత‌గా క్లిక్కులు లైక్ లతో మోతెక్కిపోతుంది. ఫాలోవ‌ర్స్ పెరుగుతారు. ఇన్ స్టా.. ట్విట్ట‌ర్ వంటి చోట్ల ఫాలోయింగ్ పెంచుకోవాలంటే నిరంత‌రం ఇలాంటి జిమ్మిక్కులు త‌ప్ప‌నిస‌రి. తార‌లంతా అదిరిపోయే గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది అందుకే.

ఇక ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ హాట్ యాంక‌ర్స్ వ‌రుస ఫోటోషూట్ల‌తో ఇన్ స్టా వేదిక‌గా మంట‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. యాంక‌ర్ కం న‌టి అన‌సూయ త‌ర్వాత రేష్మి గౌత‌మ్ కూడా అంతే వైర‌ల్ గా చ‌ర్చ‌ల్లోకొస్తున్నారు.

తాజాగా రేష్మి రెడ్ హాట్ శారీలో ద‌ర్శ‌న‌మివ్వ‌గా .. దీనికి అభిమానుల నుంచి స్పంద‌న అనూహ్యంగా ఉంది. రెడ్ ఫ్లేమింగ్ శారీలో రేష్మి అదిరిపోయిందంటూ రెడ్ ఆపిల్స్ చెర్రీ ఫ్రూట్స్ ని షేర్ చేశాడో వీరాభిమాని. రెడ్ మిర్చిలా ఘాటుగా ఉంది అంటూ వేరొక అభిమాని మిర్చి ఈమోజీల్ని షేర్ చేశాడు. ఓవ‌రాల్ గా రేష్మి రెడ్ హాట్ శారీ లుక్ వైర‌ల్ గా మారింది. రెడ్ ఫ్లేమ్ శారీకి త‌గ్గ‌ట్టే రెడ్ హాట్ టాప్ తో టాప్ లేపేసింది ఈ ట్యాలెంటెడ్ యాంక‌ర్ కం న‌టి. చూస్తుంటే మునుముందు యూత్ కి బోలెడంత ట్రీట్ ఉందని హింట్ ఇచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ గా ప్రూవైంది. వెండితెరపై క‌థానాయిక‌గానూ నిరూపించుకునేందుకు రేష్మి ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.