Begin typing your search above and press return to search.

మరో యాంకర్ తో పులిహోర కలిపిన వర్మ...!

By:  Tupaki Desk   |   4 July 2020 7:45 AM GMT
మరో యాంకర్ తో పులిహోర కలిపిన వర్మ...!
X
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇక సినిమాలతో పాటు యాంకర్ల మీద కూడా ఫోకస్ పెట్టినట్లున్నాడు వర్మ. ఇటీవల పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ రూపాయి ఖర్చు లేకుండా తన సినిమాలని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్న వర్మ.. తనని ఇంటర్వ్యూ చేసే లేడీ యాంకర్స్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. గతంలో 'నీలాంటి అందమైన యాంకర్ నన్ను ఇంతవరకు ఇంటర్వ్యూ చేయలేదని' కామెంట్ చేసిన ఆర్జీవీ ఇటీవల అరియనా అనే యాంకర్ ని చూసి 'నిన్ను చూస్తే వావ్' అనిపిస్తుందని పులిహోర కలిపేసాడు. అంతేకాకుండా సదరు యాంకర్ తో 'నిన్ను బికినీలో చూడాలనేది నా కోరిక. నేను నీకు ఆఫర్ ఇస్తాను. బికినీలో రోల్ చేయడానికి ఇష్టమైతేనే. ఒకవేళ నువ్వు నో చెబితే.. ఆ సంగతి మరిచిపోతాను' అంటూ సూటిగా చెప్పేసాడు. ఇప్పుడు లేటెస్టుగా వర్మ దృష్టి మరో యాంకర్ పై పడింది.

ఇటీవల వరుసగా ఇంటర్వూస్ ఇస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా చందన అనే యాంకర్ తో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో 'అమ్మాయిల్లో బ్యూటీని మీరు లెక్కకట్టేటప్పుడు వేటిని పరిగణలోకి తీసుకుంటారు' అని వర్మను అడిగింది చందన. దీనికి వర్మ సమాధానం చెప్తూ.. ''బ్యూటీ అంటే షేర్ ఫుల్‌ నెస్.. నేను ఈ మధ్య కాలంలో చూసిన అమ్మాయిల్లో మోస్ట్ బ్యూటిఫుల్ మీరు.. ఇంత అందమైన మీరు యాంకర్‌ గా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. హార్ట్ ఫుల్‌ గా చెప్తున్నా.. నువ్ నమ్మినా నమ్మకపోయినా.. నువ్ చాలా బ్యూటిఫుల్. నువ్ ఉండాల్సింది ఇక్కడ కాదు.. వచ్చేయ్ సినిమాల్లోకి.. నీకు ఎనీ టైమ్ నటించాలని అనిపించినా.. నన్ను కాంటాక్ట్ చెయ్యి.. నీకు వెంటనే ఆఫర్ ఇస్తా.. ఇది కెమెరా ముందు చాలా సీరియస్‌ గా చెప్తున్నా'' అంటూ ఆఫర్ ఇచ్చాడు.

ఇక వర్మ మాటలకు సిగ్గుపడిపోయిన యాంకర్ చందన.. 'టీవీలో కనిపించేవాళ్లు బ్యూటిఫుల్‌ గా ఉండొద్దని అంటారా?' అంటూ 'మీరు అందాన్ని పొగుడుతుంటే నాకు ఇంకొకటి గుర్తువచ్చింది.. చాలా మంది యాంకర్స్ ని మీరు ఇలాగే పొగుడుతూ ఉంటారు కదా..?'' అని వర్మని ప్రశ్నించారు. అంతేకాకుండా ''మీకు హౌస్ వైఫ్ అంటే ఇష్టం ఉండదని అంటారు కదా.. కారణం ఏంటి?'' అని అడిగింది. దీనిపై వర్మ మాట్లాడుతూ ''నిజమే.. నాకు హౌస్ వైఫ్ అంటే ఇష్టం ఉండదు.. వంట ఇంట్లో చెమటలు పట్టి పనులు చేసే ముఖాలు నాకు ఇష్టం ఉండదు'' అని సమాధానమిచ్చారు. మొత్తం మీద ఈ మధ్య యాంకర్స్ తో వర్మ పులిహోర కలిపే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటి వల్ల ఆ యాంకర్స్ కూడా ఫేమస్ అవుతున్నారు అనుకోండి..!