Begin typing your search above and press return to search.

పట్టాలెక్కనున్న 'శేఖర్' మూవీ.. జార్జిరెడ్డి భామకు ఛాన్స్..?

By:  Tupaki Desk   |   9 Jun 2021 3:30 PM GMT
పట్టాలెక్కనున్న శేఖర్ మూవీ.. జార్జిరెడ్డి భామకు ఛాన్స్..?
X
తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య రీమేక్ సినిమాలు బాగానే తెరకెక్కుతున్నాయి. అందులో ముఖ్యంగా ఎక్కువ సినిమాలు మలయాళం ఇండస్ట్రీ నుండి రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఇదే వరుసలో టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూడా జాయిన్ అయ్యాడు. రాజశేఖర్ హీరోగా 'శేఖర్' అనే కొత్త సినిమా ప్రారంభం అయింది. ఆ మధ్యలో రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా శేఖర్ మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సినిమాను 2018లో సూపర్ హిట్ అయినటువంటి మలయాళం జోసెఫ్ సినిమా ఆధారంగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే రాజశేఖర్ కెరీర్ లో ఇది 91వ సినిమా కావడం విశేషం. ఫస్ట్ లుక్ లో యాంగ్రీ యంగ్ మెన్ అనే పేరుకు ఆప్ట్ అయ్యేవిధంగా రఫ్ గా కనిపిస్తున్నాడు రాజశేఖర్. కెరీర్ ప్రారంభంలోనే అంకుశం, తలంబ్రాలు, ఆగ్రహం లాంటి సినిమాలతో పోలీస్ అధికారి పాత్రలలో చెలరేగిపోయాడు. తాజా సమాచారం ప్రకారం.. శేఖర్ సినిమాలో కూడా రాజశేఖర్ మరోసారి పోలీసు అధికారిగా కనిపించనున్నాడు. పోలీస్ పాత్రలకు రాజశేఖర్ పెట్టింది పేరు. పోలీస్ క్యారెక్టర్స్ తోనే ఆయన స్టార్డం సాధించాడు. కానీ ఈసారి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇటీవలే అనారోగ్యం బారినుండి రాజశేఖర్ కోలుకున్నాడు.

తాజాగా వరుసగా సినిమాలు లైన్ లో పెట్టేసాడు. అయితే నూతన దర్శకుడు లలిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ సినిమాను ఎంఎల్వి సత్యనారాయణతో పాటు రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళం అను సితారను ఖరారు చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమాలో హీరో కూతురు క్యారెక్టర్ కోసం జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్ ఖుబ్చాందిని ఎంపిక అయినట్లు తెలుస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా థ్రిల్లర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. చూడాలి మరి యాంగ్రీ మ్యాన్ ఈసారి హిట్ కొడతాడేమో..!