జక్కన్న ఫ్యామిలీ సినిమా మరీ ఇంత సైలెంట్ ఏంటో?

Fri Sep 23 2022 19:41:28 GMT+0530 (India Standard Time)

rajamouli family movie is so silent

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఫ్యామిలీ వ్యక్తి సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి. ఆ సినిమా చిన్న హీరో అయినా.. చిన్న బడ్జెట్ అయినా కూడా రాజమౌళి పేరుతో మంచి క్రేజ్ దక్కే అవకాశం ఉంది. కానీ తాజాగా కీరవాణి తనయుడు సింహా నటించిన దొంగలున్నారు జాగ్రత్త సినిమా కు మాత్రం ఏమాత్రం బజ్ క్రియేట్ అవ్వలేదు. జక్కన్న ఫ్యామిలీకి చెందిన వారు ఎవరు కూడా ఈ సినిమా గురించి పెద్దగా స్పందించిందే లేదు.దొంగలున్నారు జాగ్రత్త సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజంగా ఈ సినిమా రిలీజ్ అయ్యిందా అన్నట్లుగా ఇండస్ట్రీ వారే కొందరు ప్రశ్నిస్తున్నారు అంటే ఎంత సైలెంట్ గా ఈ సినిమా విడుదల అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు అసలు జరగలేదు. దాంతో చాలా డల్ గా ఓపెనింగ్స్ ఉన్నాయి.

విడుదల అయ్యిందే తక్కువ థియేటర్లలో పైగా ప్రమోషన్ లేకపోవడంతో చాలా చోట్ల షో లు కూడా క్యాన్సిల్ అయినంతగా పరిస్థితి ఉందంటూ బాక్సాపీస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. జక్కన్న ఫ్యామిలీ హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని మీడియా సర్కిల్స్ వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

జక్కన్న కాకున్నా కనీసం కీరవాణి లేదా ఇతర కుటుంబ సభ్యులతో అయినా సినిమా ప్రమోషన్ చేయించలేదు. దాంతో చాలా సైలెంట్ గా సినిమా వచ్చింది. ఈ సినిమా హాలీవుడ్ లో ఎక్కువగా కనిపించే సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందింది.

రెండు గంటల లోపే ఉన్న ఈ సినిమా ను ఓటీటీలో విడుదల చేస్తే బాగుండేది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేశారు. థియేటర్ సండి లేక పోవడంతో వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సైలెంట్ గా సినిమా రిలీజ్ చేయడం వెనుక మరేదైనా ఉద్దేశ్యం ఉందా అనేది వారే చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.