Begin typing your search above and press return to search.

వీడియో : ఈ హీరోయిన్ మల్టీ ట్యాలెంటెడ్

By:  Tupaki Desk   |   27 May 2020 9:10 AM GMT
వీడియో : ఈ హీరోయిన్ మల్టీ ట్యాలెంటెడ్
X
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దు గుమ్మా రాశి ఖన్నా కెరీర్ ఆరంభం నుండి కూడా మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. కెరీర్ ఆరంభంలో సినిమా లో హీరోయిన్ గా నటించడంతో పాటు పాటలు పాడటం డబ్బింగ్ కూడా చెప్పేందుకు ఆసక్తి చూపించి మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకుంది.

గత రెండు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వడంతో రాశి ఖన్నా గిటార్ వాయించడం నేర్చుకుంది. మొదటి నుండి కూడా రాశిఖన్నా కు గిటార్ ప్లేయింగ్ అంటే చాలా ఇష్టం అవ్వడంతో ఈ రెండు నెలలు నేర్చుకుంది. గిటార్ వాయిస్తూ స్వయంగా పాట పాడింది. ఆ వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నాకు ఎంతో ఇష్టం అయిన గిటార్ ప్లే చేయడం నేర్చుకున్నాను అంటూ చాలా సంతోషంగా రాశి పేర్కొంది. ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు అంటూ కామెంట్ పెట్టింది. రాశి ఖన్నా పోస్ట్ చేసిన వీడియో నెట్టింటి వైరల్ అయ్యింది. లక్షకు పైగా లైక్స్ దక్కించుకుంది.