హీరోయిన్ ఫిగర్ తో లేత సోయగాల తెలుగు సుందరాంగి..

Thu May 28 2020 23:00:01 GMT+0530 (IST)

punarnavi latest pic goes viral

బిగ్ బాస్ బ్యూటీ పునర్వవి భూపాలం.. అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈరోజుల్లో బిగ్ బాస్ ప్రోగ్రాం చూడని వాళ్లు ఉండరు. ముఖ్యంగా అందులో పాల్గొనే కంటెస్టెంట్లు అందరూ గుర్తుంటారు. అలాగే సినిమాలతో రాని గుర్తింపు బిగ్ బాస్ రియాలిటీ షోతో దక్కించుకుంది. ప్రస్తుతం పునర్నవి అందచందాలకు మెరుగులు అద్దేపనిలో పడింది. ఇప్పుడైతే అమ్మడికి సినిమా అవకాశాలేవీ లేవని అర్ధమవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ఎంతగా ఆకట్టుకున్నా సినిమా అవకాశాలు మాత్రం అందనంత దూరంగానే ఉంటున్నాయి. చేసేదేం లేక ఈ తెలుగు అందం.. సోషల్ మీడియాలో ఆకట్టుకునే ఫోటోలు ఫోజులతో అభిమానులు మనసులు చూరగొంటుంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ వర్కౌట్స్‌తో బొద్దు అందాలను నాజూకుగా మార్చేందుకు చెమటలు చిందిస్తోంది. నిజంగా పునర్నవిలో ఇన్ని సోయగాలు ఉన్నాయా? అనే విధంగా అందాలను కొసరికొసరి వడ్డిస్తోంది. ఇక జిమ్‌లో ఎద అందాల వీడియోలను పోస్ట్ చేసి యూత్‌లో సెగలు రేపింది.క్వారంటైన్ వలనో ఏమో కాని తనకు చాలా బోరింగ్‌గా ఉందంటూ ఈ ఫొటోలను షేర్ చేసింది పునర్నవి. ఇక కామెంట్స్‌లో ఆమె అందచందాలను ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు వర్ణించుకుంటూ.. మధ్యలో రాహుల్ ప్రస్తావన కూడా తీసుకురావడం మాములే అయిపోయింది. ఉయ్యాలా జంపాల సినిమాతో ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన పునర్నవి.. తర్వాత మళ్లీ మళ్లీ ఇది రానిరోజు.. పిట్టగోడ.. ఎందుకో ఏమో.. ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ.. ఒక చిన్న విరామం.. వంటి సినిమాల్లో మెరిసింది. కానీ అమ్మడికి మాత్రం కెరీర్ లో ఎలాంటి ఊపు తీసుకురాలేక పోయాయి ఈ సినిమాలన్నీ. ఇక తాజాగా అమ్మడు ఇంస్టాగ్రామ్ లో ఫొటోలు పోస్ట్ చేసింది. ఎల్లో డ్రెస్ అమ్మడి సోయగాలు చూడముచ్చటగా ఉన్నాయంటూ నెటిజన్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ పునర్నవి టాప్ హీరోయిన్ అవ్వాలనే కసితో ఉన్నట్లు సమాచారం.

TAGS: punarnavi