సీమపిల్ల చిచ్చరపిడుగులా పేలేది ఇంకెప్పుడు?

Sat May 21 2022 11:03:53 GMT+0530 (IST)

priyanka jawalkar latest photo news update

అనంతపురం బ్యూటీ..సీమ పిల్ల ప్రియాంక జవాల్కర్ సుపరిచితురాలే. `కలవరమాయే` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యువ నాయిక అటుపై `టాక్సీవాలా`తో తొలి సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది.  ఇందులో అమ్మడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన మెరిసింది.  యాక్టింగ్ సహా యూత్ లో ఇంప్రెసివ్ గాళ్ గా పాపులర్ అయింది.అటుపై నటించిన `తిమ్మరుసు` ఆశించిన ఫలితం ఇ్వకపోగా `ఎస్ఆర్ కళ్యాణమండం` రూపంలో మాత్రం పెద్ద సక్సెస్ అందుకుంది. కానీ సీమ బిడ్డ కెరీర్ మాత్రం ఇంకా ఊపందుకోలేదు. ఇంకా నత్త నడకనే సాగుతుంది. సక్సెస్ లున్నా...సరైన అవకాశాలు అందుకోవడంలో విఫలమవుతుంది. మీడియం రేంజ్  హీరోల సరసన నటించే అర్హతలన్నీ ఉన్నా.. ఆ రకమైన ఛాన్సులు రావడం లేదు.

యువతలో క్రేజీ బ్యూటీగా పాపులర్ అయింది. సోషల్ మీడియా  అటెన్షన్  బాగానే డ్రా చేయగలుగుతుంది. అందాల ఆరబోతకి తక్కువేం కాదు. ఎలివేషన్లకి ఏమాత్రం అడ్డు చెప్పదని ఇన్ స్టా ని చెక్ చేస్తే తెలిసిపోతుంది. మడి కట్టుకుని కుని ఉండే నటి కాదు. మరి తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎందుకు అవకాశాలు అందుకోవడంలో వెనుకబడుతుంది? అంటూ ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఇదే కొనసాగితే పోటీ రేసులో వెనుకబడటం ఖాయం. ప్రస్తుతం యువ భామల మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. కృతి సనన్..రితికా నాయక్..రుక్షార్ డిల్హాన్ లాంటి యువ నాయికలు దూసుకుపోతున్న వైనం  చేస్తుందే. వాళ్ల తో రేసులో నిలబడాలంటే ఛాన్స్ ఒక్కటే మార్గం. దానికి తగ్గట్టు మౌల్డ్ అవ్వాలి. పోటీలా ఎలా  ఉన్నా దూసుకుపోయే తత్వాన్ని అలవరుచుకోవాలి. అప్పుడే రేసులో నిలబడేది.

ప్రస్తుతం `గమనం` అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందస్తున్నారు. సుజనరావు దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రాజెక్ట్ పెద్దదే. కానీ ప్రియాంక నలుగురు హీరోయిన్లలో ఒకరు.  జారా అనే పాత్రలో నటిస్తుంది. ఇలాంటి పాత్రలు  ఎన్ని చేసినా హీరోల సరసన ఛాన్సులు తేలేవు. సోలో నాయికగా ఎస్టాబ్లిష్ అవ్వగలిగితేనే అవకాశాలు క్యూ కట్టేది. లేదంటే నలుగురితో నారాయణ..కులంతో గోవిందా అన్న తరహాలోనే జర్నీ సాగుతుందన్నది గమనించాల్సిన విషయం.