మళ్లీ పేలిన అనంతపురం హాట్ బాంబ్

Tue Jan 18 2022 11:28:57 GMT+0530 (IST)

priyanka jawalkar Latest Picture

తెలుగమ్మాయి.. అనంతపురం హాట్ బాంబ్ ప్రియాంక జవాల్కర్ పరిచయం అవసరం లేదు. `టాక్సీవాలా` చిత్రంతో కెరీర్ పరంగా షైన్ అయిన ప్రియాంక కెరీర్ నెమ్మదిగా స్పీడందుకుంది. తొలి సినిమా `కలవరమాయే` అంతగా గుర్తింపు తేనప్పటికీ దేవరకొండ టాక్సీవాలా కెరీర్ కి కీలకమలుపునిచ్చింది. నటిగా ప్రియాంకకు యూత్ ఫుల్ మార్క్స్ వేశారు. ఇక గ్లామరస్ హీరోయిన్ గా ఒక ముంబై డాళ్ కి తగ్గని వయ్యారం తన సొంతం అని ప్రూవ్ చేస్తోంది. నిరంతరం సోషల్ మీడియాల్లో ప్రియాంక ఫోటోషూట్లు అంతే ట్రెండింగ్ గా మారుతున్నాయి.ఇటీవల వరుస చిత్రాలతో తెలుగు ఆడియెన్ ని పలకరించింది ప్రియాంక. ఈ బ్యూటీ నటించిన `తిమ్మరుసు` సినిమా పాజిటివ్ సమీక్షలు అందుకున్నా కానీ ఆశించిన రేంజును అందుకోలేకపోయింది. సత్యదేవ్ సరసన ప్రియాంక నటనకు గుర్తింపు దక్కింది. ఇక ప్రియాంక నటించిన మరో సినిమా `ఎస్.ఆర్ కళ్యాణ మండపం` ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన కామెడీ లవ్ ఎంటర్ టైనర్ గా ఇది నిలిచింది. ఈ సినిమా విజయం సాధించడంతో ప్రియాంక మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు చేజిక్కించుకుంటోంది.

ప్రస్తుతం  సుజన్ రావు అనే  కొత్త దర్శకులు తెరకెక్కిస్తున్న `గమనం` అనే సినిమాలో నటిస్తోంది. ఇక ప్రియాంక జవాల్కర్ కి సోషల్ మీడియాలో ఉన్న అసాధారణ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాక్సీవాలా సినిమా తర్వాత సోషల్ మీడియా ద్వారా అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. అప్పుడప్పుడు హాటెస్ట్ ఫోటోలతోనూ హీటెక్కిస్తుంది. తాజాగా  వైట్ అండ్ హాట్ లుక్ తో మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. మిరుమిట్లు గొలిపే వైట్ టాప్ కాంబినేషన్ గా పింక్ బాటమ్ తో హాట్ గా అందాల్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అనంతపురం హాట్ బాంబ్.. తెలుగమ్మాయి హీట్ మళ్లీ మొదలైందిగా! అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.