Begin typing your search above and press return to search.

స్పెయిన్ వీధుల్ని ఒణికిస్తున్న పీసీ వైర‌స్

By:  Tupaki Desk   |   14 Oct 2021 8:53 AM GMT
స్పెయిన్ వీధుల్ని ఒణికిస్తున్న పీసీ వైర‌స్
X
రోమ్ లో ఉంటే రోమ‌న్ లా ఉండాల‌ని అన్నారు. ఇక్క‌డ స్పెయిన్ వీధుల్ని ఒణికిస్తోంది పీసీ వైర‌స్. లండ‌న్ నుంచి పీసీ ఇంత‌కీ స్పెయిన్ ఎందుకు వెళ్లిన‌ట్టు అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలాన్ని క‌రోనా వైర‌స్ లా జెట్ స్పీడ్ తో చుట్టేస్తోంది. బ్లూ అండ్ బ్లూలో ప్రియాంక చోప్రా అంద‌చందాలు అలా స్పెయిన్ కుర్రాళ్ల‌కు మ‌త్తెక్కించాయనే చెప్పాలి. ఈ అంద‌మైన ఫోటోని షేర్ చేసిన పీసీ దీనికి అంతే అంద‌మైన క్యాప్ష‌న్ ఇచ్చింది. స్పెయిన్ లో ఉన్నప్పుడు ప్రియాంక చోప్రా మీ గైడ్ గా ఉంటే అంత‌కంటే ఇంకేం కావాలి? ``మీరు ముందుకు సాగకపోతే .. మీరు వెనక్కి తగ్గుతారు`` అంటూ ప్రియాంక చోప్రా జోడించిన వ్యాఖ్య చాలా అర్థాల్ని ధ్వ‌నిస్తోంది.

సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా మరోసారి తన మనసులోని మాటను బయటపెట్టింది. అలా స్పెయిన్ వీధిలో గోడకు అభిముఖంగా నిలబడి పీసీ ఏం చేస్తోందో కానీ.. ఆమె వెనుక ఉన్న గ్రాఫిటీ సౌంద‌ర్యం వ్వావ్ అనిపిస్తోంది. ప్రియాంక తన తదుపరి ప్రాజెక్ట్ సిటాడెల్ కోసం ఇలా ర‌క‌ర‌కాల ప్లేస్ ల‌కు వెళుతోంది. చివరకు ఈ విహారం స్పెయిన్ కు తీసుకువచ్చింది. పీసీ తన శీర్షికలో ``మీరు ముందుకు సాగకపోతే ... మీరు వెనక్కి తగ్గుతారు`` అని రాశారు. దీనికి ``మ్యూజింగ్స్`` అనే హ్యాష్ ట్యాగ్ ను పీసీ జోడించింది. తొలుత సౌత్ లో న‌టించిన పీసీ.. త‌ర్వాత బాలీవుడ్ కి వెళ్లింది. అక్క‌డ పెద్ద స్టార్ అయ్యింది. ఆ త‌ర్వాత హాలీవుడ్ లోనూ స‌త్తా చాటుతోంది. ప్లేస్ మారినా త‌న రేంజు త‌గ్గ‌డం లేదు. ప్ర‌దేశాల‌ పరంగా.. ఆమె కెరీర్ పథంలో ప్రియాంక ముందుకు సాగడం మనం చూశాం. ఇప్పుడు స్పెయిన్ లోనూ త‌న‌కు భారీ ఫాలోయింగ్ పెరుగుతోంది.

ప్రియాంక చోప్రా స్పెయిన్ వీధుల్లో అద‌ర‌గొడుతోంది. ఒక రోజు సెలవులో ఆమె త‌న‌ తల్లి గారితో పాటు సన్నిహితులతో బయటకు వెళ్లినప్పుడు వాలెన్సియాలో డేస్ ఎంతో ఆనందంతో గడిచిపోయాయి. ఫోటోలలో గ్రూప్ అంతా వారి సమయాన్ని పూర్తిగా ఆస్వాధిస్తూ క‌నిపిస్తున్నారు. ప్రియాంక వాట‌ర్ బేబీగానూ అల‌రిస్తోంది. ఆమె తన తల్లి స్నేహితులు పెంపుడు జంతువుతో విలువైన‌ సమయాన్ని గడుపుతోంది. పీసీ ఇలా స్టైలిష్ లుక్ లో అద్భుతంగా కనిపిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఫోటోలలోనే ఒకదానిలో ఆమె స్పీడ్ బోట్ లో ప్రయాణిస్తూ క‌నిపించింది. ఒక ఖచ్చితమైన సెల‌వు రోజు అంటూ ప్రియాంక తన శీర్షికలో రాసింది. ప్రియాంక చోప్రా కూడా సిటాడెల్ సెట్స్ నుండి తెర వెనుక విష‌యాల‌ను ఇలా ఫోటోల రూపంలో అందిస్తోంది. అలాంటి ఒక ఫోటోలో దూరంగా కొండల శ్రేణి ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.

సూర్యోదయం చాలా తక్కువగా ఉండటంతో ఫోటో తెల్లవారుజామున లేదా సంధ్యా సమయంలో క్లిక్ చేసినట్లు అనిపిస్తుంది. ప్రియాంక శీర్షిక త‌దుప‌రి సిరీస్ కోసం మా నిరీక్షణ ఇది అని వెల్ల‌డించింది.``ఆమె యోధుడిలాంటి భయాలను ఎదుర్కొంటుంది ... మీరు ఆమెను కలిసే వరకు వేచి ఉండలేరు`` అంటూ పీసీ పోస్ట్ చేసింది.

వేసవిలో లండన్‌లో గడిపిన సమయాలు ప్రియాంక చోప్రా మనస్సులో చిరస్మరణీయంగా ఉంటాయి. పీసీ ఇంత‌కుముందు తన వేసవి ఆల్బమ్ నుండి ఫోటోలను పోస్ట్ చేసింది. ``సమ్మర్ .. నువ్వు నాకు మంచిగా ఉన్నావు`` అని ఆమె క్యాప్షన్ లో రాసింది. అప్ప‌ట్లో ఆ ఫోటోలు అంతే వైర‌ల్ అయ్యాయి. ప్రియాంక చోప్రా తదుపరి సిటాడెల్ లో కనిపిస్తుంది. ఇది మల్టీ-సిరీస్ ప్రొడక్షన్. అలాగే భారీ యాక్ష‌న్ చిత్రం మ్యాట్రిక్స్ 4 కూడా పీసీ న‌టిస్తోంది.