Begin typing your search above and press return to search.

'రాధే శ్యామ్' గురించి ప్రియదర్శి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు..!

By:  Tupaki Desk   |   16 Jun 2021 11:30 AM GMT
రాధే శ్యామ్ గురించి ప్రియదర్శి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు..!
X
'పెళ్లి చూపులు' సినిమాతో కమెడియన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి.. ఇప్పుడు విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నాడు. ఓవైపు కామెడీతో నవ్విస్తూనే మరోవైపు సీరియస్ రోల్స్ చేస్తున్నాడు. దర్శి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' మరికొన్ని గంటల్లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అలానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమాలో కూడా దర్శి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటరాక్షన్ సందర్భంగా ప్రియదర్శి 'రాధే శ్యామ్' సినిమా గురించి.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

'రాధే శ్యామ్' ఒక గ్రేట్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ అని ఇందులో తన పాత్ర కామెడీ టచ్ తో ఉంటుందని ప్రియదర్శి చెప్పాడు. అంతేకాదు ఇందులో తనది హీరోయిన్ పూజా హెగ్డేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసే పాత్ర అని దర్శి తెలిపాడు. అలానే తనకు ప్రభాస్ అన్నకు మధ్య మంచి కామెడీ సన్నివేశాలు ఉన్నాయని అన్నాడు. ప్రభాస్ తనను స్వీట్ హార్ట్ అని పిలుస్తాడని.. ఆయనతో ఎక్కువ సమయం గడపాలని, మాట్లాడాలని అనిపిస్తుందని.. ప్రభాస్ ఆతిథ్యాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రియదర్శి చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమాలో కూడా ప్రియదర్శి కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం.