'వకీల్ సాబ్' ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా రెడీ చేస్తున్నారా..?

Fri Mar 05 2021 09:00:01 GMT+0530 (IST)

preparing Vakeel Saab as a regular commercial movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేధా థామస్ - అంజలి - అనన్య కీలక పాత్రలు పోషించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. ఇది హిందీలో సూపర్ హిట్ అయి పలు అవార్డులు అందుకున్న 'పింక్' చిత్రానికి తెలుగు రీమేక్. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ డ్రామాగా 'పింక్' తెరకెక్కింది. ఈ సందేశాత్మక సినిమా కథ మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూనే తిరుగుతుంది. అయితే తెలుగులో 'వకీల్ సాబ్' నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తే మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాని కాస్తా రెగ్యులర్ కమర్షియల్ చిత్రంగా మార్చారనే కామెంట్స్ వస్తున్నాయి.వాస్తవానికి 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ మరియు టీజర్ నుంచి నిన్న వచ్చిన 'సత్యమేవ జయతే' సాంగ్ వరకు ఎక్కడా కూడా ఇందులో కీ రోల్స్ ప్లే చేసిన హీరోయిన్ల గురించి ప్రస్తావించలేదు. పవన్ ని ఎలివేట్ చేస్తూ యాక్షన్ సన్నివేశాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ టీజర్ ని వదిలారు. నిన్న వచ్చిన సాంగ్ లో కూడా హీరోయిజంని చూపిస్తూ పీకే అభిమానులను ఎంటర్టైన్ చేసేలా రెడీ చేశారు. దీంతో 'వకీల్ సాబ్' చిత్రాన్ని పవన్ కంబ్యాక్ మూవీగా మాత్రమే తీస్తున్నారని.. ఉమెన్ సెంట్రిక్ సినిమాని కాస్త రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మార్చారని 'పింక్' చిత్రాన్ని అభిమానించే వాళ్ళు అభ్యంతరం చెబుతున్నారు. ఇకపోతే తమిళ్ లో సస్టార్ హీరో అజిత్ స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ మహిళా ప్రాధాన్యం తగ్గించలేదు. మరి 'వకీల్ సాబ్' నుంచి మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా వారికి సంబంధించిన ఏదైనా కంటెంట్ ని రిలీజ్ చేస్తారేమో చూడాలి.