గోల్డెన్ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుంటాడా?

Sat Oct 01 2022 07:00:02 GMT+0530 (India Standard Time)

prabhudeva movie news

`రౌడీ రాథోర్` తరువాత ప్రభుదేవా హిట్టు మాట విని చాలా ఏళ్లవుతోంది. వరుసగా ఈ మూవీ తరువాత దాదాపు తొమ్మిదేళ్లుగా ప్రభుదేవా బ్యాక్ టు బ్యాక్ ఆరు డిజాస్టర్లని సొంతం చేసుకున్నాడు. ఇప్పడు తనని ఫ్లాపుల నుంచి గట్టెక్కించే స్టార్ కావాలి. దర్శకుడిగా మళ్లీ ట్రాక్ లోకి రావడానికి భారీ స్థార్ అవకాశం ఇవ్వాలి.. అంటే అతనికి గోల్డెన్ ఛాన్స్ కావాలన్నమాట. అలాంటి అవకాశం అతనికి లభించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా `గాడ్ ఫాదర్` అక్టోబర్ 5న భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ ఫిల్మ్ ``లూసీఫర్` ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేశారు. మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే వున్నాయి. ఈ మూవీతో పాటు చిరు మరో రెండు ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. `వాల్తేరు వీరయ్య``భోళా శంకర్`. ఇవే కాకుండా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అందులో ఒకటి వెంకీ కుడుములతో మరొకటి మారుతితో.. ఇవి రెండూ పట్టాలెక్కడానికి ఇంకా టైమ్ పడుతుంది. అయితే ఈ లోగా ప్రభుదేవాతో ఓ సినిమా చేయాలని చిరు అనుకుంటున్నారట. 15 ఏల్ల క్రితం వీరిద్దరి కలయికలో `శంకర్ దాదా జిందాబాద్` రూపొందింది. అయితే ఆశించిన విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఇద్దరు కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట.

నెట్ ఫ్లిక్స్ లో పాపులర్ అయిన ఓ వెబ్ సిరీస్ పై కన్నేసిన చిరు దాన్ని సినిమాగా చేయాలని అనుకుంటున్నారట. ఆ బాధ్యతల్ని ప్రభుదేవాకు అప్పగించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధాన పాత్ర డాన్. స్పానిష్ థ్రిల్లర్ కథ కావడంతో దీన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చమని ప్రభుదేవాకు చెప్పారట.

అయితే ఫైనల్ వెర్షన్ తో ప్రభుదేవా చిరుని ఒప్పించగలిగితేనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని లేకపోతే ముందుకు వెళ్లదని చెబుతున్నారు. మరి ప్రభుదేవా రాక రాక వచ్చిన  గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకుంటాడా?  అన్నది వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.