Begin typing your search above and press return to search.

స్టార్ హీరోల ఫ్యాన్ వార్ హ‌ద్దులు దాటేస్తోంది!

By:  Tupaki Desk   |   28 Jan 2023 10:01 PM GMT
స్టార్ హీరోల ఫ్యాన్ వార్ హ‌ద్దులు దాటేస్తోంది!
X
స్టార్ హీరోల అభిమానుల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారుతోంది. హీరోలు ఫ్రెండ్స్ లా వ్య‌వ‌హ‌రిస్తూ పార్టీల్లో క‌లిసి తిరుగుతుంటే స‌ద‌రు హీరోల అభిమానులు మాత్రం సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న్నుకు చ‌స్తున్నారు. గ‌త కొంత కాలంగా అభిమానుల మ‌ధ్య మాట‌ల యుద్ధం హ‌ద్దులు దాటుతూ ప‌రాకాష్ట‌కు చేరుకుంటూ వెగ‌టు పుట్టిస్తోంది. `RRR` రిలీజ్ కి ముందు అంటూ ట్రైల‌ర్ రిలీజ్ ద‌గ్గ‌రి నుంచే రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అభిమానులు సోష‌ల్ మీడియాలో వార్ డిక్లేర్ చేసుకున్నారు.

ట్రైల‌ర్ లో మా హీరోకు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదంటే మా హీరోకు ఇవ్వ‌లేదంటూ నెట్టింట రాజ‌మౌళిపై నిప్పులు చెరిగారు. ఇక సినిమా రిలీజ్ త‌రువాత మా హీరోని ఇలా చూపించారంటే.. మా హీరోకు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదంటూ ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకున్నారు. మ‌ళ్లీ రాజ‌మౌళిని టార్గెట్ చేస్తూ నెట్టింట పోస్ట్ లు పెడుతూ నానా హంగామా చేశారు. ఇప్ప‌డు ఇదే త‌ర‌హా యుద్ధం ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబు అభిమానుల మ‌ధ్య జ‌రుగుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియా వ‌ర‌కే ప‌రిమిత‌మైన ఫ్యాన్స్ వార్ ఇప్పుడు హ‌ద్దులు దాటేసి రోడ్డెక్కుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. వీరి వీధి పోరాటం పోలీస్ స్టేష‌న్ ల దాకా వెళ్లేలా క‌నిపిస్తోంద‌నే విమ‌ర్‌శ‌లు వినిపిస్తున్నాయి. ఎన్న‌డూ లేనిది కొత్త‌గా మ‌హేష్‌, ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ మొద‌లైంది. ఒక‌రంటే ఒక‌రిని రెచ్చ‌గొడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. అంత‌టితో ఆగ‌క ఈ ఇద్ద‌రు హీరోల ఫ్యామిలీ ఫొటోల‌ని షేర్ చేస్తూ బ‌హిరంగ వార్ కు స‌వాల్ విసురుకుంటున్నారు.

లోకేష‌న్ లు షేర్ చేసుకుంటూ మ్యాన్ హ్యాండిలింగ్ కి సై అంటే సై అంటూ స‌వాల్ చేసుకుంటున్నతీరు క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. వీళ్ల వారు ఇక్క‌డితో ఆగ‌క గాజులు, చీర‌ల వ‌ర‌కు వెల్ల‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ గాజులు చూపిస్తూ మ‌హేష్ అభిమానుల్ని రెచ్చ‌గొడుతున్నారు. ఇదంతా బెంగ‌ళూరులో ప్ర‌భాస్‌, మ‌హేష్ అభిమానుల మ‌ధ్య జ‌రిగింది. ఇక హైద‌రాబాద్ లోనూ ఇదే వ‌ర‌స‌.

ఇద్ద‌రు హీరోల అభిమానుల చిల్ల‌ర ప‌నులు, అల్ల‌రి చేష్ట‌లు చూసిన వారంతా ప‌నీ పాట లేని వాల్లు చేసే ప‌నులివ‌ని, ఇద్ద‌రు క‌లిసి హీరోల ప‌వ‌రువు తీస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. హీరోలు ఫ్రెండ్స్ గా వ్య‌వ‌హ‌రిస్తూ ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో వుంటే వారి ఫ్యాన్స్ మాత్రం ఇలా సోష‌ల్ మీడియా వేదిక‌గా వీధిరౌడీల్లా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఏమీ బాగాలేద‌ని మ‌రి కొంత కొంత మంది ఫ్యాన్స్ పై కామెంట్ లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.