మేకోవర్ కు రెడీ అవుతున్న ప్రభాస్?

Tue Sep 17 2019 22:30:23 GMT+0530 (IST)

prabhas Make over on About Jaan Movie

ప్రభాస్ లేటెస్ట్ ఫిలిం 'సాహో' కు ఎలాంటి స్పందన దక్కిందో అందరికీ తెలిసిందే.  అంచనాలు భారీ స్థాయిలో ఉన్నప్పటికీ వాటిని అందుకోలేకపోయింది. అయితే ప్రభాస్ క్రేజ్ పీక్స్ లో ఉండడంతో కలెక్షన్స్ భారీగా నమోదు చేయగలిగింది.  కమర్షియల్ లెక్కల సంగతి పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని అంశాలపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వచ్చింది.



వాటిలో ఒకటి 'సాహో' కు అనవసరమైన ఖర్చు పెట్టడం.  దీంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా విషయంలో ఆల్రెడీ బడ్జెట్ విషయంలో జాగ్రత్త పడుతున్నారని వార్తలు వచ్చాయి. 'సాహో' కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను బట్టి ప్రభాస్ నెక్స్ట్ సినిమాకు స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేయవలసిందిగా ప్రభాస్ ఇప్పటికే దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కు చెప్పాడని సమాచారం.  ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రభాస్ లుక్స్.. హెయిర్ స్టైల్ పైన ఫ్యాన్స్ కూడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారట. దీంతో ఈ విషయాన్ని ప్రభాస్ తీవ్రంగా పరిగణిస్తున్నాడట.

ఇప్పటికే స్పెషల్ డైట్ మొదలు పెట్టాడని.. గతంలో కంటే ఎక్కువగా ఎక్సర్ సైజ్ పై ఫోకస్ చేస్తున్నాడని అంటున్నారు.  రాధాకృష్ణ కుమార్ సినిమా నవంబర్ నుంచి బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తారట. అప్పటికి ఫిట్ గా మారాలనే లక్ష్యంతో ప్రభాస్ శ్రమిస్తున్నాడట.  కొత్త హెయిర్ స్టైల్ లో కనిపించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఏదేమైనా డార్లింగ్ ఇలా ఆడియన్స్  ఫీడ్ బ్యాక్ ను.. ఫ్యాన్స్ ఆలోచనలను పట్టించుకోవడం మంచి విషయమే.