టార్చర్ పెట్టాడు.. నేను ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నా ః రష్మిక

Mon Jan 17 2022 14:58:08 GMT+0530 (IST)

post about Rashmika Mandanna and Kuldeep has gone viral

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు తన వ్యక్తిగత మరియు సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన జిమ్ ట్రైనర్ కుల్దీప్ వేసిన సామి సామి సాంగ్ వీడియో ను షేర్ చేసింది. ఆ వీడియోకు ఫన్నీ కామెంట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫన్నీ కన్వర్జేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. కుల్దీప్ నెట్టింట షేర్ చేసిన వీడియో ను రష్మిక షేర్ చేయడంతో అతడి గురించి మరింతగా జనాలకు తెలిసింది. కులదీప్ చాలా హార్డ్ వర్క్ ను రష్మికతో చేయిస్తాడట. ఆ విషయాన్ని రష్మిక గతంలో పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది.రష్మిక మందన్నా తాజాగా సోషల్ మీడియాలో... నన్ను జిమ్ లో కుల్దీప్ చాలా టార్చర్ పెట్టాడు. చేసిన వర్కౌట్ మళ్లీ మళ్లీ చేయిస్తూ ఇబ్బంది పెట్టేవాడు. తాజాగా అతడు సామి సామి పాటకు డాన్స్ వేశాడు. ఆ డాన్స్ చేసే సమయంలో నేను అక్కడ ఉంటే ఖచ్చితంగా అతడిని ఆ స్టెప్స్ మళ్లీ మళ్లీ చేయించేదాన్ని అంటూ కామెంట్ చేసింది. టార్చర్ పెట్టే విధంగా అతడితో డాన్స్ మూమెంట్స్ ను మళ్లీ మళ్లీ వేయించే అవకాశం ను మిస్ చేసుకున్నట్లుగా ఫన్నీ కామెంట్ చేసింది. అతడు ఇలాంటి ఒక డాన్స్ చేస్తాడని నేను అనుకోలేదని రష్మిక చెప్పుకొచ్చింది. నీ స్థాయి స్టెప్పులు వేయడం కుల్దీప్ కు సాధ్యం కాదు కనుక ఆయన నీ చేతికి దొరికితే ఖచ్చితంగా బలయ్యేవాడేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

టార్చర్ పెట్టడం వల్లే మీరు వర్కౌట్స్ ఎక్కువ సమయం చేసి ఇంత అందంగా ఉన్నారంటూ మరి కొందరు ఆమె వ్యాఖ్యలకు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రష్మిక మందన్నా మరియు కుల్దీప్ లకు సంబంధించిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే పుష్ప సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో మరిన్ని ఆఫర్లు ఆమెకు ఛాన్స్ దక్కించుకుంది. బాలీవుడ్ లో  ఈ అమ్మడు రెండు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు కన్నడం మరియు హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తోంది.