బికినీలు షేర్ చేసి కూనిరాగాలు తీస్తోంది!

Wed Jan 19 2022 13:41:40 GMT+0530 (IST)

pooja with toned physique

బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి ఇటీవల నవతరం నాయికలు ఎంతో ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే. బీచ్ బం పార్టీలంటే పడి చస్తున్నారు. సారా అలీఖాన్ - జాన్వీ కపూర్ - అనన్య పాండే లాంటి నేటితరం బ్యూటీస్ మాల్దీవుల విహారంతో అగ్గి రాజేస్తున్నారు.అయితే వీళ్లకు ఏమాత్రం తగ్గని రీతిలో పూజా హెగ్డే ఇటీవలే మాల్దీవుల్లో మంటలు పెట్టిన సంగతి తెలిసిందే. వరుస బికినీ షూట్లతో మెంటలెక్కించింది ఈ బ్యూటీ.

ఓ వైపు హిందీ కెరీర్ మరోవైపు సౌత్ కెరీర్ పీక్స్ లో వెలిగిపోతుంటే పూజా ఇలా చెలరేగడంలో ఆశ్చర్యం అవసరం లేదు. అయితే ఇప్పుడు వీటన్నిటినీ మించి అనిపించేలా పూజా షేర్ చేసిన హాట్ బికినీ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. టాప్ టు బాటమ్ 90 డిగ్రీల కోణంలో పూజా తనను తాను ఆవిష్కరించుకున్న తీరు వేడెక్కించింది. అలా రెండు పేలికల్లాంటి పీసుల్లో పూజా మెంటలెక్కించింది. ప్రస్తుతం ఇది అంతర్జాలంలో యూత్ ని సునామీ స్పీడ్ తో చుట్టేస్తోంది. ఇక పూజా కి 2021 పెద్ద రేంజులో కలిసొచ్చింది. 2022లో ఏకంగా ఐదారు సినిమాలు రిలీజ్ లకు రానున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ ఎవరికీ కలిసి రాకపోయినా ఈ బ్యూటీకి మాత్రం రెవెన్యూ అమాంతం పెంచింది. కేవలం 2021-22 సీజన్ లో వరస గా భారీ మల్టీస్టార్లలో నటించి ఈ బ్యూటీ ఏకంగా 25 కోట్లు పైగా సంపాదించుకుందని అంచనా. అందుకే ఇన్ స్టాలో వరుస బికినీ షూట్లను షేర్ చేస్తూ పద్యాలు పాడుతూ కూనిరాగాలు తీస్తోంది.