Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : స్టార్‌ హీరో లక్కీ బ్రాస్‌లెట్‌ తో బుట్టబొమ్మ

By:  Tupaki Desk   |   14 May 2022 3:30 PM GMT
ఫోటోటాక్ : స్టార్‌ హీరో లక్కీ బ్రాస్‌లెట్‌ తో బుట్టబొమ్మ
X
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ చేతికి ఎప్పుడు కూడా గ్రీన్ స్టోన్ తో ఒక బ్రాస్‌లెట్ ఉంటుంది. ఆయనకు అది లక్కీ అంటూ ఉంటాడు. ఏ సినిమాలో నటించినా.. ఏ పాత్ర చేసినా కూడా ఆ బ్రాస్లెట్‌ మాత్రం చేతికే ఉంచుకుంటూ ఉంటాడు. సల్మాన్ ఖాన్‌ బ్రాస్ లెట్‌ వంటి వాటిని ఎంతో మంది ధరిస్తూ ఉంటారు. సల్మాన్‌ ఖాన్ బ్రాస్ లెట్‌ అంటూ చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం.

తాజాగా సల్మాన్ ఖాన్‌ బ్రాస్లెట్‌ ను బుట్ట బొమ్మ పూజా హెగ్డే ధరించి ఫోటోకు ఫోజు ఇచ్చింది. ఆ బ్రాస్ లెట్ చూసిన వెంటనే సల్మాన్‌ ఖాన్‌ గుర్తుకు వస్తాడు. దాంతో సల్మాన్ ఖాన్‌ ను ఉద్దేశించి ఆమె పోస్ట్‌ చేసినట్లుగా అనిపిస్తుంది.

ఈ ఫోటో ను షేర్‌ చేసి షూటింగ్‌ ప్రారంభం అయ్యింది అంటూ కామెంట్ పెట్టింది. సల్మాన్ ఖాన్ తో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సినిమా ప్రారంభం అయ్యిందని పూజా హెగ్డే సంతోషం వ్యక్తం చేసింది.

సల్మాన్‌ ఖాన్‌ కబీ ఈద్ కబీ దీవాళి సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తుంది. కరోనా వల్ల గత ఏడాది కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్‌ ప్రారంభం అయ్యిందని పూజా హెగ్డే ఈ ఫోటో షేర్ చేయడంతో క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. సల్మాన్‌ ఖాన్ ను చిన్నప్పటి నుండి చూస్తూ అభిమానిస్తూ వచ్చాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉందంటూ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది.

పూజా హెగ్డే ఈమద్య కాలంలో వరుసగా సినిమాలతో నిరాశ పర్చుతూ వచ్చింది. అయినా కూడా బాలీవుడ్ లో ఈమె చేయబోతున్న ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఉంది. తెలుగు లో రాధేశ్యామ్‌.. ఆచార్య సినిమాలు ప్లాప్‌ అయినా కూడా స్టార్‌ హీరోలకు ఇంకా మోస్ట్ వాంటెడ్‌ గానే ఉంది. ఇప్పటికే మహేష్ బాబుతో సినిమాకు ఈ అమ్మడు కమిట్‌ అయ్యింది.

టాలీవుడ్‌.. బాలీవుడ్‌.. కోలీవుడ్‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న పూజా హెగ్డే సల్మాన్ ఖాన్‌ తో సినిమా పట్ల చాలా ఎగ్జైట్‌ గా ఉంది. అందుకే షూటింగ్ ప్రారంభం అయిన రోజే సల్మాన్ ఖాన్‌ యొక్క బ్రాస్ లెట్‌ తో ఫోటో దిగి సోషల్‌ మీడియాలో షేర్ చేసి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకు అది సల్మాన్ లక్కీ బ్రాస్ లెట్‌ అయ్యి ఉంటుందా.. లేదంటే దానికి కాపీనా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.