బుట్ట బొమ్మ పూజాహెగ్డే ఇంట విషాదం

Mon Mar 01 2021 10:00:01 GMT+0530 (IST)

pooja hegde grand mother died

బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇంట విషాదం నెలకొంది. తాను అమితంగా ప్రేమించే భామ్మగారు మరణించారు. ఈ విషయాన్ని పూజా స్వయంగా వెల్లడించారు. తాను ఎక్కడ ఉన్నా అక్కడ ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా హాయిగా ఉండాలని పూజా కోరుకుంది.ఈ క్యూటీని మేం కోల్పోయాను.. కష్టాలలో ఉన్నా నవ్వుతూనే ఉండాలని ఆమె మాకు నేర్పించింది భామ్మ. ధైర్యంగా ఉండాలని ఉద్భోధించింది. కావాల్సిన వారి కోసం ఈగోల్ని వదిలిపెట్టాలని నేర్పించింది. తాను మా మధ్య లేకపోయినా నాతోనే ఉంటుంది. లవ్ యు ఆజీ..! అంటూ దుఃఖ సాగరంలో మునిగిపోయింది పూజా.

షూట్ టైమ్ లో ఫోన్లు చేసి .. ఏం చేస్తున్నావ్?  ఎలా ఉన్నావ్? అని నువ్వడిగే ప్రశ్నల్ని కాల్స్ ని మిస్సవుతున్నాను భామ్మా.. అని ఆవేదనకు గురైంది పూజా. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. రాధేశ్యామ్  .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో పూజా నటించింది. త్వరలోనే ఇవన్నీ రిలీజ్ కి రావాల్సి ఉంది. మరోవైపు బాలీవుడ్ చిత్రాలతోనూ పూజా బిజీగా ఉంది.