ప్లస్ 2లో పాయల్ అందం చూస్తే షాకే

Mon Jul 06 2020 12:30:04 GMT+0530 (IST)

photo moment payal rajput in her plus 2 days

నేటి కథానాయికలు ఒకప్పటి టీనేజీ కాలేజ్ గాళ్స్. స్కూల్.. కాలేజ్ డేస్ లో అందరిలానే అల్లరి చిల్లర వేషాలతో వేడి పుట్టించిన వారే ఎక్కువ. కొందరు సైలెంట్ కిల్లర్స్ లా ఏదీ బయటికి తెలియనివ్వకపోతే.. మరి కొందరు మాత్రం అల్లరి వేషాల్ని బయటికి వ్యక్తం చేస్తుంటారు.ఆ కోవలోనే పాయల్ కాలేజ్ డేస్ లుక్ చూస్తే ఈ అమ్మడి వ్యవహారం ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కథానాయిక అయ్యి ఆర్.ఎక్స్ 100.. ఆర్.డీ.ఎక్స్ లవ్ అంటూ వేడి పుట్టించే సినిమాల్లో నటించిన పాయల్ కాలేజ్ డేస్ లో కూడా ఏమాత్రం తగ్గలేదు. ఈ పంజాబీ కుడి కాలేజ్ డేస్ లో ముక్కు పుడకతో ఓ రేంజులోనే కుర్రాళ్ల గుండెల్ని గిచ్చేసిందని అర్థమవుతోంది. కాస్త బొద్దు గా కనిపిస్తోంది కానీ లుక్ పరం గా హాట్ అప్పీల్ కి కొదవేమీ లేదు.

పాయల్ ప్లస్ 2 రోజుల లో తీసిన ఫోటో ఒకటి ప్రస్తుతం అంతర్జాలం లో వైరల్ గా మారింది. ఈ ఛాయా చిత్రం ఆమె అభిమానులకు స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. అప్పుడైనా ఇప్పుడైనా పింక్ సల్వార్ డ్రెస్ లో పూర్తిగా నిశ్శబ్దంగా పక్కింటి అమ్మాయిలా కనిపించినా తన లోని అల్లరి వేషాల్ని మాత్రం దాచలేక పోతోంది. పాయల్ అందం చందం టీనేజర్ల కు కవ్వింత గానే ఉంటుంది మరి.