నెట్టింట హల్చల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ హాట్ షో..!

Sun May 09 2021 16:00:01 GMT+0530 (IST)

payal rajput trendy look

సోషల్ మీడియాను షేక్ చేయడంలో సినీ హీరోయిన్స్ ముందుంటారు. అందులోను బాలీవుడ్ నుండి వచ్చే భామలు ఖచ్చితంగా బోల్డ్ అనే పదానికి మారుపేరులా ఉంటారు. అలాంటి బ్యూటీలలో ఒకరు పాయల్ రాజపుత్. ఈ వయ్యారి ఎంట్రీనే ఆర్ఎక్స్100 అనే సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ తో సక్సెస్ అందుకుంది. అలాగే డెబ్యూ యాక్ట్రెస్ గా అవార్డు కూడా తీసుకుంది. కానీ మళ్లీ ఆ రేంజి సక్సెస్ అందుకోలేదు. అలాగని టాలీవుడ్ లో బిజీ కూడా కాలేకపోయింది. ఈ వయ్యారి గ్లామర్ షోలో కూడా అసలు వెనకాడదు. అందుకే బోల్డ్ బ్యూటీగా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను తన అందాలతో ముంచెత్తుతుంది. సినిమాల్లోనే ఓ రేంజిలో అందాలను ప్రదర్శించే పాయల్.. ఇంకా గ్లామరస్ ఫోటోషూట్స్ కూడా అదే రేంజిలో అదరగొడుతుంది.ఇప్పటివరకు పలు సినిమాల్లో మెరిసింది పాయల్. కానీ ఇంకా ఆర్ఎక్స్100 బ్యూటీగానే కంటిన్యూ అవుతోంది. ఆర్డిఎక్స్ లవ్ అనే బోల్డ్ సినిమా చేసిన పాయల్.. స్కిన్ షోలో సక్సెస్ అయింది కానీ సినిమా మాత్రం నిరాశపరిచింది. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలో పోటీ తట్టుకోవాలి అంటే కావాల్సింది గ్లామర్ మాత్రమే కాదు. స్టోరీ సెలక్షన్ - హార్డ్ వర్క్ కూడా ముఖ్యమే. హార్డ్ వర్క్ చేస్తోంది కానీ స్టోరీ సెలక్షన్స్ లో మాత్రం అమ్మడు విఫలం అవుతూ వస్తోంది. ఫస్ట్ సినిమాతో అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ చేసిన పాయల్.. తన పై ఓ మోస్తరు అంచనాలు ఏర్పరచుకుంది. ఆ అంచనాలను అందాలతో బీట్ చేస్తోంది కానీ సక్సెస్ తో కాదు. ప్రస్తుతం అమ్మడు సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా పాయల్ హాట్ ఫోటోషూట్ తో ఇంస్టాను షేక్ చేస్తోంది. తాజాగా పాయల్ నాభి నడుము అందాలు చూపి కుర్రకారులో చిచ్చు రేపుతోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.