Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పాయ‌ల్ ర‌తిరేయి విలాసాలు

By:  Tupaki Desk   |   12 Sep 2021 11:30 PM GMT
ఫోటో స్టోరి: పాయ‌ల్ ర‌తిరేయి విలాసాలు
X
పంజాబీ బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ హాటెస్ట్ ఫోటో షూట్లు ఇటీవ‌ల సంచ‌ల‌నంగా మారుతున్నాయి. కెరీర్ ఆరంభం నుంచి ఆందాల ఆర‌బోత‌లో తుఫాన్ లా విరుచుకుప‌డుతోంది ఈ బ్యూటీ.. డెబ్యూ మూవీలోనే హాటెస్ట్ కంటెంట్ తో యూత్ గుండెల్లో రాణిగా మారిపోయింది. తొలి చిత్రంతోనే బోలెడంత పాపులారిటీ ద‌క్కించుకుంది. అటుపై సోష‌ల్ మీడియాని ప‌ర్పెక్ట్ గా ఉప‌యోగించుకుని మ‌రింత ఫోక‌స్ అయింది. ప్ర‌స్తుతం న‌టిగా పాయ‌ల్ కెరీర్ తాపీగానే సాగిపోతుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో టెప్టింగ్ ఫోటోతో ఇన్ స్టా నే షేక్ చేస్తోంది. ర‌తిరేయి మ‌న్మ‌ధుని స‌ఖిలా ఆర్.ఎక్స్ బ్యూటీ చెల‌రేగిపోయింది. ఇన్న‌ర్ లో అందాల్ని అమ్మ‌డు ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది.

డ‌బుల్ కోటెడ్ ఇన్న‌ర్ ధ‌రించి మ‌త్తుక‌ళ్ల‌తో వేడెక్కించింది పాయ‌ల్. విర‌బోసిన కురుల అందాల‌తో పాయ‌ల్ ఎంతో స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త పాయ‌ల్ ని ఆవిష్క‌రించింది ఈ ఫోటోషూట్. నైట్ లైట్ లో పాయ‌ల్ గ‌మ్మ‌త్తుగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. పాయ‌ల్ ర‌తిరాణిలా కైపెక్కించిందంటూ హాట్ కామెంట్లు ప‌డుతున్నాయి. ఇక పాయ‌ల్ కెరీర్ విష‌యానికి వ‌స్తే ఆర్ ఎక్స్ 100 సినిమాతో పాయ‌ల్ రాజ్ పుత్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అటుపై కొంత మంది అగ్ర హీరోల చిత్రాల్లోనూ అవ‌కాశాలు అందుకుంది.

ప్ర‌స్తుతం తెలుగులో ఛాన్సులు బాగానే వ‌స్తున్నాయి. కోలీవుడ్ లోనూ అవ‌కాశాలు అందుకుంటోంది. అలాగే క‌న్న‌డ‌లో ఓ డాన్ స్టోరీలో న‌టిస్తోంది. బెంగుళూరు సిటీని మొట్ట మొద‌ట‌గా గ‌డ‌గ‌డలాడిండించిన జ‌య‌రాజ్ బ‌యోపిక్ `హెడ్ బుష్` టైటిల్ తో తెర‌కెక్కుతోంది. ఇందులో డాన్ మొద‌టి గాళ్ ప్రెండ్ పాత్ర‌లో న‌టిస్తోంది. జ‌య‌రాజ్ కి చాలా మంది గాళ్ ప్రెండ్స్ ఉండ‌గా పాయ‌ల్ పోషించే పాత్ర మాత్రం చాలా కీల‌క‌మైన‌ది. డాన్ జీవితంలో కొన్ని మార్పులు సైతం తీసుకొచ్చిన రోల్ అది. ఈ నేప‌థ్యంలో పాయ‌ల్ పాత్ర‌కు మంచి పేరొచ్చే అవ‌కాశం ఉంది. ఆ పాత్ర కోసం పాయ‌ల్ పంజాబ్ లో ఉంటోన్న జ‌య‌రాజ్ గాళ్‌ ప్రెండ్ ని సైతం క‌లిసి పాత్ర‌కు త‌గ్గ‌ట్టు త‌నని మ‌లుచుకుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.