Begin typing your search above and press return to search.

జులై నుండి పవర్ స్టార్ షూటింగ్ స్టార్ట్..?

By:  Tupaki Desk   |   24 May 2020 2:30 AM GMT
జులై నుండి పవర్ స్టార్ షూటింగ్ స్టార్ట్..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' షూటింగులో బిజీ ఉండగానే తన తదుపరి చిత్రం పనులను శరవేగంగా మొదలుపెట్టాడు డైరెక్టర్ క్రిష్. పవన్ కళ్యాణ్ 26వ చిత్రం వకీల్ సాబ్ హిందీ నుండి రీమేక్ చేస్తుండగా ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజకీయాల తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అలాంటిది తదుపరి చిత్రం విరూపాక్ష గురించి చిన్న వార్త తెలిసినా అభిమానులకు పండగే. పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏయం రత్నం నిర్మిస్తుండగా.. ఈ సినిమా మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కనుంది. ఇది మొగలాయిల కాలం నాటి కథ అని.. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని తెలిపారు.

ఈ చారిత్రాత్మక క‌థ‌ను క్రిష్ కూడా పవన్‌ ఇమేజ్ కి స‌రిపోయేలా తయారు చేసాడట. చారిత్రాత్మక చిత్రం కావడంతో రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను ఆ కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే గొప్ప చిత్రంగా నిలుస్తుందని, పవన్ కళ్యాణ్ నటించనున్న తొలి చారిత్రాత్మక చిత్రం కనుక చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరి డైరెక్టర్ క్రిష్ చాలా కాలం గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమాపై పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ జులై సెకండ్ వీక్ నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ సినిమాను తక్కువ టైంలో పూర్తి చేయడానికి క్రిష్ సెట్ డిజైన్ చేసారని టాక్. చూడాలి మరి నిజంగా జులైలో షూటింగ్ మొదలైతే ఫ్యాన్స్ కి పండగే.. అని చెప్పాలి!