Begin typing your search above and press return to search.

116 మంది న‌ర్సులు ప్రాణాల‌ర్పించార‌న్న‌ ఉపాస‌న‌

By:  Tupaki Desk   |   12 May 2021 9:30 AM GMT
116 మంది న‌ర్సులు ప్రాణాల‌ర్పించార‌న్న‌ ఉపాస‌న‌
X
మాన‌వ సేవే మాధ‌వ సేవ‌..! మ‌నిషి క‌ష్టంలో ఉన్న‌ప్పుడు దేవుడికి ద‌ణ్ణం పెట్టినా ఉప‌యోగం ఉండ‌దు. నేరుగా క‌ష్టంలో ఉన్న‌వారిని ఆదుకుంటేనే ప్ర‌యోజనం. ఏడాది కాలంగా ప్ర‌పంచాన్ని కోవిడ్ 19 ఒణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాలంలో వైర‌స్ ని నిలువ‌రించే ర‌ణంలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ సేవ‌ల్ని మ‌ర్చిపోలేం. డాక్ట‌ర్లు- న‌ర్సులు - పోలీసులు - మున్సిప‌ల్ సిబ్బంది సేవ‌ల్ని ఎన్న‌టికి మ‌రువ‌లేం.

నిజానికి ప్ర‌పంచాన్ని కాపాడిన సైనికులు వీరంతా. బార్డ‌ర్ లో సైన్యం దేశాల మ‌ధ్య ప్ర‌త్య‌క్ష యుద్ధం స‌మ‌యంలో కాపాడితే.. క‌నిపించ‌ని వైర‌స్ అనే శ‌త్రువుపై యుద్ధం చేసింది ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ మాత్ర‌మే. అందుకే వారికి హ్యాట్సాఫ్ చెప్ప‌కుండా ఉండ‌లేం.

అందుకే కాస్త స‌మ‌యాన్ని ఇలా న‌ర్సుల‌తో గ‌డిపారు ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్. అపోలో హెల్త్ అధినేత్రిగా .. లైఫ్ స్టైల్ మ్యాగ‌జైన్ క‌ర్త‌గా సామాజిక క‌ర్త‌గా ఉపాస‌న సేవ‌లు అస‌మానం. ఈ కోవిడ్ వేళ ప్ర‌జ‌ల‌కు ర‌క‌ర‌కాల‌ సేవలు అందించారు. కొంత మెడిసిన్ ని ఉచితంగా అందించారు. కొన్ని నెల‌ల క్రితం ఆస్ప‌త్రి న‌ర్సుల‌తో గ‌డిపిన ఫోటోని షేర్ చేసిన ఉపాస‌న 2021 ఫిబ్ర‌వ‌రి నాటికి దేశ‌వ్యాప్తంగా సేవ‌ల్లో ఉన్న 116 మంది న‌ర్సులు కోవిడ్ 19 రోగుల‌ ద్వారా సోకి చ‌నిపోయార‌ని వెల్ల‌డించారు. జాతి త‌ర‌పున మీ మేలును ఎప్ప‌టికీ మ‌రువం! అంటూ చ‌లించిపోయారు ఉపాస‌న‌. స‌ద‌రు నర్సులంద‌రికీ న‌మ‌స్సుమాంజ‌లి ఘ‌టించారు. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా 60 దేశాల్లో 3000 మంది న‌ర్సులు చ‌నిపోగా.. 174 మంది భార‌తీయ‌ డాక్ట‌ర్లు దేశం లోప‌ల‌ చ‌నిపోయారు.