నాటు నాటు మాత్రమే కాదు.. ఈ రెండూ ఆస్కార్ బరిలోకి?

Tue Jan 24 2023 22:07:04 GMT+0530 (India Standard Time)

oscar selected movies All That Breathes as well as Elephant Whisperers

అందరూ ఊహించిందే నిజమైంది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు సాంగ్ ఒక చరిత్ర సృష్టించింది. ఈ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 95 వ ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. అయితే ఆస్కార్ అవార్డుల బరిలో మరిన్ని కేటగిరీలలో కూడా ఈ సినిమా నిలుస్తుంది అనుకుంటే కేవలం ఒక్క ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో మాత్రమే నామినేట్ అయింది. అయితే ఈ సంగతి అలా ఉంచితే తెలుగు నుంచి కాదు కానీ ఇండియా నుంచి మరో రెండు సినిమాలు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యాయి.ఆల్ దట్ బ్రీత్స్ అలాగే ఎలిఫెంట్ విస్పరర్స్ అనే సినిమాలు కూడా బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం క్యాటగిరీలలో నామినేట్ అయ్యాయి. ఆల్ దట్ బ్రీత్స్ అనే డాక్యుమెంటరీని షౌనాక్సేన్ తెరకెక్కించగా ఎలిఫెంట్ ఫీజు అనే డాక్యుమెంటరీని కార్తికి గోన్ సాల్వ్ తెరకెక్కించారు. అయితే ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ప్రభుత్వం తరపున నామినేట్ చేయబడిన చెల్లో షో సినిమా మాత్రం ఎటువంటి కేటగిరీలో కూడా నామినేట్ అవ్వలేదు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం క్యాటగిరిలో ఈ సినిమా నామినేట్ అవుతుందని భావించారు కానీ ఆ అవకాశం దక్కలేదు.

ప్రస్తుతానికి ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు ఆల్ దట్ బ్రీట్స్ అలాగే ఎలిఫెంట్ విస్పరర్స్ అనే సినిమాలకు మాత్రమే అవకాశం దక్కింది మార్చి 13వ తేదీన జరగబోతున్న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లో వీటిలో ఏ సినిమాలకు ఆస్కార్ వహిస్తుంది అనేది చూడాల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో తెరకెక్కిన నాటు నాటు సాంగ్ కచ్చితంగా అవార్డు లభిస్తుందని అందరూ భావిస్తున్నారు.

కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా చంద్రబోస్ సాహిత్యం అందించారు ఇక సాంగ్ మాత్రమే కాదు వీడియో విజువల్స్ కూడా ప్రేక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. కొన్నాళ్ల క్రితం అయితే విపరీతంగా ఈ సాంగ్ గురించి రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.