Begin typing your search above and press return to search.

శ్యామ్ సింగరాయ్ కోసం రెడీ అవుతున్న 'కలకత్తా సెట్'!

By:  Tupaki Desk   |   26 May 2020 9:30 AM GMT
శ్యామ్ సింగరాయ్ కోసం రెడీ అవుతున్న కలకత్తా సెట్!
X
టాలీవుడ్ నేచురల్ స్టార్ 'నాని' హీరోగా 'జెర్సీ' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన ఉత్తమ కథ సినిమాని నిర్మించిన యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి 'నాని' హీరోగా చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'టాక్సీ వాలా' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు 'రాహుల్ సాంకృత్యన్' దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. అయితే ఈ చిత్రానికి 'శ్యామ్ సింగ రాయ్' అనే పేరును నిర్ణయించినట్లు తెలిసిందే. 'నాని' పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని, వీడియోను యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో 2020 డిసెంబర్ 25న చిత్రం విడుదల కానుందని తేదీని కూడా ప్రకటించారు. హీరో 'నాని' కి ఇది 27వ చిత్రం. అయితే రాహుల్ కథ ఫైనల్ చేసిన తర్వాత శ్యామ్ సింగరాయ్ టైటిల్ సెట్ చేయడంతో సినిమా పై స్పెషల్ బజ్ మొదలైంది. ఈ సినిమా పిరియడిక్ కాన్సెప్ట్ తో రూపొందనుంది కాబట్టి అభిమానులలో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి.

నిర్మాతలు కూడా హై బడ్జెట్ లో సినిమాను ప్లాన్ చేసి పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేయాలని అనుకున్నారట. ఈ మధ్య పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు బాగానే సిద్ధం అవుతున్నాయి. విడుదలై సక్సెస్ కూడా అవుతున్నాయి. అవసరం అయితే ఆ పాతతరం కాలాన్ని చూపించడానికి సెట్ వేయడం కూడా చేస్తుంటారు. ప్రస్తుతం నాని హీరోగా రాబోయే శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా పాతకాలం కథ ఆధారంగా తెరకెక్కనుంది. ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరగనుందని తెలుస్తుంది. అందుకోసం ఈ సినిమాలో కలకత్తాను చూపించబోతున్నారట. ఈ సినిమా కథే కాస్త ఫాంటసీ మిక్స్ అయి పాత కలకత్తా లుక్ లో ఉందట. ఇక ఇప్పుడు కలకత్తా పాతకాలంలో ఉన్నట్లు లేదు కాబట్టి హైదరాబాద్ లోనే కలకత్తా సెట్ వేయబోతున్నారట. ఈ ఏడాది చివరలో రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు. ఇక ప్రస్తుతం నాని టక్ జగదీష్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ పట్టాలు ఎక్కనుందని సమాచారం.