నితిన్ కాబోయే భార్య ఫ్యామిలీకి చిరు ఫ్యామిలీకి ఉన్న సంబంధం?

Wed Feb 19 2020 10:41:33 GMT+0530 (IST)

nithin fiance shalini reddy kandukuri mother sheikh noorjahan worked for chiranjeevi praja rajyam pa

యంగ్ హీరో నితిన్ ఒక ఇంటివాడు అవ్వబోతున్నాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఇన్ టాలీవుడ్ అంటూ నితిన్ ను ఇన్నాళ్లు అన్న వారు ఆయన్ను ఆ జాబిత నుండి తొలగించబోతున్నారు. ఇటీవలే షాలినితో నిశ్చితార్థం చేసుకున్నాడు. వచ్చే ఏప్రిల్ లో ఈయన పెళ్లి దుబాయిలో అంగరంగ వైభవంగా జరుగబోతుంది. దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు ప్రేమించుకున్న ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్దం అయ్యారు.షాలిని గురించి.. వీరి ప్రేమ గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. షాలిని తల్లిదండ్రులది ప్రేమ వివాహం. షాలిని తండ్రిది ప్రకాశం జిల్లా. అయితే హైదరాబాద్ వచ్చి అప్పట్లోనే సెటిల్ అయ్యారు. కొన్నాళ్లకు నాగర్ కర్నూలులో ప్రగతి నర్సింగ్ హోమ్ ను ప్రారంభించి అక్కడే సెటిల్ అయ్యారు. షాలిని తల్లిదండ్రులు నూర్జహాన్.. సంపత్ లు. వీరిద్దరు కూడా డాక్టర్లే.

చిరంజీవి కుటుంబంతో ఈ కుటుంబంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగానే చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే స్థానంను నూర్జహాన్ కు ఇవ్వడం జరిగింది. ఆమె గెలుపు కోసం చాలానే ప్రయత్నించింది. కాని గెలవలేక పోయింది. కాల క్రమేనా ప్రజారాజ్యం పార్టీ కనుమరుగయ్యింది. ఆ తర్వాత నూర్జాహాన్ రాజకీయాల నుండి తప్పుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి.