హీరో కోసం హీరోయిన్ కు కోటిన్నర

Sun Jan 16 2022 14:00:01 GMT+0530 (IST)

nidhi agarwal Remuneration For Hero Movie

ఈమద్య కాలంలో సౌత్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. ఒకప్పుడు కోటి రూపాయల పారితోషికం అంటే చాలా గొప్ప విషయం. స్టార్ హీరోయిన్స్ సూపర్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే ఆ స్థాయి పారితోషికం ఉండేది. కాని గత మూడు నాలుగు ఏళ్లుగా కోటి పారితోషికం అనేది చాలా కామన్ విషయం అయ్యింది. పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమాల మేకర్స్ హీరో మరియు హీరోయిన్స్ కు భారీ పారితోషికం ను ఆఫర్ చేస్తున్నారను. హీరోలు ఏకంగా వంద కోట్ల పారితోషికం దక్కించుకుంటున్న ఈ సమయంలో హీరోయిన్స్ కూడా భారీ పారితోషికాలు దక్కించుకుంటున్నారు.నిధి అగర్వాల్ ఇప్పటి వరకు 50 లక్షల నుండి 80 లక్షల మద్య పారితోషికం తీసుకుంటూ ఉండేది. కాని హీరో సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా నటించేందుకు గాను ఏకంగా కోటిన్నర పారితోషికంను అందుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. మహేష్ బాబు మేనల్లుడు అయిన గల్లా అశోక్ 'హీరో' సినిమా గురించిన పలు విషయాల పై ప్రస్తుతం మీడియా సర్కిల్స్ లో చర్చలు జరుగుతున్నాయి. అందులో ఒక అంశంగా నిధి అగర్వాల్ పారితోషికం గురించి మాట్లాడుకుంటున్నారు. అశోక్ గల్లా కొత్త హీరో కనుక ఆయనకు జోడీగా నటించడం కోసం ఏకంగా కోటిన్నర పారితోషికంను ఆమె అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మరో వైపు నిధి అగర్వాల్ హరి హర వీరమల్లు సినిమా లో పవన్ కు జోడీగా కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా వీరమల్లు సినిమా ఉంటుందనే నమ్మకంతో అంతా వెయిట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో టాలీవుడ్ లో సక్సెస్ ను దక్కించుకున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఒక కోలీవుడ్ స్టార్ హీరోతో ఈ అమ్మడు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ అమ్మడి పెళ్లి కూడా ఉంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల వారు చాలా ఆసక్తిగా వారి పెళ్లి విషయమై చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు నిధి అగర్వాల్ నుండి మాత్రం క్లారిటీ రాలేదు.