నిధి కోసమే థియేటర్లకు వెళుతున్నారట!

Sun Jan 16 2022 09:39:09 GMT+0530 (IST)

nidhi agarwal Hero Movie

అందాల నిధి అగర్వాల్ కెరీర్ బండి నెమ్మదిగా స్పీడందుకుంటోంది. ఒక్కో హిట్టు కొట్టి బండిని సరైన ట్రాక్ లో పెడుతోంది ఈ బ్యూటీ. తాజాగా సంక్రాంతి బరిలో విడుదలైన `హీరో`తో తన నటన పరంగా గ్లామర్ పరంగా ప్రశంసలు దక్కించుకుంది. సంక్రాంతి సీజన్ కాబట్టి నెమ్మదిగా ఈ మూవీ కూడా కలెక్షన్లు పెంచుకుంటోంది.ఇక తనదైన నటనతో తెలుగు - తమిళ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న నిధి అగర్వాల్ `హీరో`లో అద్భుతమైన నటనను ప్రదర్శించిందన్న ప్రశంసలు దక్కుతున్నాయి. నిధి స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లకు అతిపెద్ద క్రౌడ్ పుల్లర్ గా మారిందని చిత్రబృందం చెబుతోంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నిధి క్రేజ్ భాష ప్రాంతాలకు అతీతంగా పెరిగింది.

ప్రస్తుతానికి ఈ అందాల నాయిక క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న `హరి హర వీర మల్లు`లో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ లాంటి అగ్ర హీరోతో పాన్ ఇండియా నాయికగా ప్రమోషన్ దక్కనుంది. ఇది నిధికి పెద్ద ప్లస్ కానుంది.