Begin typing your search above and press return to search.

#సుశాంత్.. సోన‌మ్ పై విరుచుకుప‌డ్డ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   17 Jun 2020 9:50 AM GMT
#సుశాంత్.. సోన‌మ్ పై విరుచుకుప‌డ్డ ఫ్యాన్స్
X
సుశాంత్ ఎవరో నాకు తెలియదు అంటూ వ్యాఖ్యానించిన మీరా చోప్రాపై ఇంత‌కుముందు నెటిజ‌నులు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఆ త‌ర్వాత ట్వీట్ లో మీరా చోప్రా అలా ఎందుక‌ని అనాల్సొచ్చిందో వివ‌ర‌ణ ఇచ్చుకుంది. అలాగే క‌పూర్ ఫ్యామిలీ నాయిక సోనమ్ కపూర్ తాజా ట్వీట్ పైనే అదే రేంజులో నెటిజ‌నులు అక్షింత‌లు వేస్తున్నారు. సుశాంత్ ఫ్యాన్స్ ని హ‌ర్ట్ చేసేలా అంత‌గా సోన‌మ్ ఏం ట్వీట్ చేసింది? అంటే..

యువ‌హీరో సుశాంత్ మ‌ర‌ణం పేరుతో బ్లేమ్ గేమ్ ఆడోద్దని.. ప్రముఖులను హిపోక్రాట్స్ అంటూ దూషించ‌డం త‌గ‌ద‌ని సోన‌మ్ సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానించారు. ఆత్మ‌హ‌త్య అని తెలిసీ ఆరోప‌ణ‌లు దూష‌ణ‌లు స‌రికాద‌ని అభిప్రాయ‌ పడ్డారు. ఒక‌రు చని పోతే ప్రేయసి.. మాజీ ప్రేయసి ని టార్గెట్ చేస్తూ దూషించ‌డం స‌రికాద‌ని సోన‌మ్ అన్నారు. గాళ్ ఫ్రెండ్ లేదా మాజీ ప్రేయసి.. లేదా ఏదో ఒక ఫ్యామిలీ ని టార్గెట్ చేయ‌డం స‌రైన విధానం కాదు. వదిలేయడమే స్పూర్తిని క‌లిగిస్తుంద‌ని సోన‌మ్ అంది. అయితే సోన‌మ్ కి ఉన్న‌ట్టే సుశాంత్ కి కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉంటే ఇలా జ‌రిగేది కాద‌ని నెటిజ‌నులు సోన‌మ్ పై రివ‌ర్స్ కౌంట‌ర్లు వేస్తున్నారు.

ఖాన్ లు.. క‌పూర్లు.. క‌ర‌ణ్ జోహార్లు.. ఒక మాఫియాలా మారార‌ని.. ప‌రిశ్ర‌మ బ‌య‌టి వారికి అవ‌కాశాలు ఇవ్వ‌కుండా తొక్కేస్తున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్ర‌మంలోనే క‌పూర్ ఫ్యామిలీ పై ఆరోప‌ణ‌ల్ని సోన‌మ్ ఖండించే ప్ర‌య‌త్నం చేసార‌‌ని అర్థ‌మ‌వుతోంది. క‌పూర్ కుటుంబాన్ని కానీ ఖాన్ లు ఇత‌ర ప్ర‌ముఖుల కుటుంబాన్ని కానీ అన‌డం స‌రి కాద‌ని సోన‌మ్ అభిప్రాయం వ్య‌క్తం చేస్తే దానికి అంతే ఘాటుగా సుశాంత్ ఫ్యాన్స్ జ‌వాబిస్తున్నారు.