Begin typing your search above and press return to search.

సంచలనాల ఆత్మ‌కథః అంతా ‘బోల్డ్’గానే అంటున్న నీనాగుప్తా!

By:  Tupaki Desk   |   16 Jun 2021 12:30 AM GMT
సంచలనాల ఆత్మ‌కథః  అంతా ‘బోల్డ్’గానే అంటున్న నీనాగుప్తా!
X
నీనా గుప్తా అంటే ఇప్ప‌టి త‌రానికి పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోవ‌చ్చు. కానీ.. నిన్న‌టి జ‌న‌రేష‌న్ కు మాత్రం బాగా ప‌రిచ‌య‌మే. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా దుమ్ము లేపింది. ఎంతో మందికి క‌ల‌ల రాణిగా ఉంది. అయితే.. ఆమె జీవితం మాత్రం ఎక్కువ‌గా ముళ్ల‌దారిలోనే గ‌డిచింది. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌సు 62 సంవ‌త్స‌రాలు. ఇన్నాళ్ల త‌న జీవితంలో ఎదురైన ఎన్నో సంచ‌ల‌న విష‌యాల‌ను పొందు ప‌రుస్తూ త‌న 'ఆత్మ‌క‌థ' తీసుకొచ్చారు. 'సచ్ కహా తో' పేరుతో వచ్చిన ఈ పుస్త‌కంలో ఎవ్వ‌రూ ఊహించ‌లేని ఎన్నో అంశాల‌ను రాసుకొచ్చిన‌ట్టు తెలిపారు నీనా. ఈ పుస్త‌కాన్ని సోమ‌వారం (జూన్ 14) బాలీవుడ్ బ్యూటీ క‌రీనా క‌పూర్ ఆవిష్క‌రించారు.

ఈ పుస్త‌కంలో త‌న జీవితానికి సంబంధించిన అన్నిర‌కాల రిలేష‌న్స్, ఎమోష‌న్స్ తో, బ్రేక‌ప్ లు అన్ని బోల్డ్ గా చ‌ర్చించిన‌ట్టు చెప్పారు నీనా. తాను డ్రామా ఆర్టిస్టుగా ఉన్న‌ది మొద‌లు.. ముంబైలో అడుగు పెట్టే వ‌ర‌కు ప్ర‌తీ విష‌యాన్ని మెన్ష‌న్ చేశాన‌న్నారు. అంతేకాకుండా.. సినిమా ఇండ‌స్ట్రీలో ఎలాంటి అండ లేకుండా ఎదుర్కొన్న ఇబ్బందులు మొద‌లు.. కాస్టింగ్ కౌచ్, పాలిటిక్స్ వంటి ఎన్నో సంచ‌ల‌న అంశాల‌నూ ఆత్మ‌క‌థ‌లో పొందు పరిచిన‌ట్టు తెలిపారు నీనా గుప్తా.

త‌న కెరీర్ ఆరంభంలో త‌న ఓ వ్య‌క్తి అఫైర్ న‌డిపాడ‌ని, తీరా పెళ్లి వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి నో చెప్పాడ‌ట‌. అత‌ను ఇప్ప‌టికీ బ‌తికే ఉన్నాడ‌ని, హాయిగా ఉన్నాడ‌ని.. ఆయ‌న త‌న పుస్త‌కాన్ని చ‌దువుతాడ‌ని కూడా చెప్పారు నీనా. అదేవిధంగా.. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం వివిఎన్ రిచ‌ర్డ్స్ తో ఎఫైర్‌, అత‌నితో బిడ్డ‌ను క‌న‌డం.. ఆ త‌ర్వాత‌ విడిపోవ‌డం వంటి విష‌యాలు కూడా ఈ పుస్త‌కంలో రాసిన‌ట్టు చెప్పారు.

ఈ విష‌యాల‌న్నీ ప్ర‌పంచంతో షేర్ చేసుకుంటున్న నీనా.. త‌న‌ త‌ల్లిదండ్రులు బ‌తికి ఉంటే మాత్రం ఆత్మ‌క‌థ రాసేదాన్ని కాద‌ని చెప్పారు. త‌న జీవితంలోని ప‌లు విష‌యాలు తెలుసుకుంటే వాళ్లు బాధ‌ప‌డేవార‌ని, అందుకే ఇన్నాళ్లూ రాయ‌లేద‌ని చెప్పారు. మ‌రి, నీనా జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే.. 'సచ్ కహా తో' కొనుగోలు చేయాల్సిందే. లేటు వ‌య‌సులో ఈ మ‌ధ్య‌నే వివేక్ మెహ్రాను పెళ్లి చేసుకున్న నీనా.. ప్ర‌స్తుతం ముక్తేశ్వ‌ర్ లో నివ‌సిస్తున్నారు.