తమిళ హీరోలపై కన్నేసిన మైత్రి

Wed Jan 25 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

mythri movie makers on tamil heros

టాప్ ప్రొడక్షన్ కంపెనీల్లో ఒకటి మైత్రి మూవీ మేకర్స్. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ ఎన్నో హిట్ సినిమాలను నిర్మించింది. కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ మైత్రి నుంచి సినిమా వస్తుందంటే అది కచ్చితంగా సూపర్ హిట్ అలరించే సినిమా అని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతారు. దీంతో అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో నెంబర్ వన్ నిర్మాణ సంస్థగా మైత్రి మూవీ మేకర్స్ నిలిచింది.ఈ ఏడాది సంక్రాంతికి ఈ సంస్థ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి. మరొక సినిమా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. భారీ కలెక్షన్లను రాబట్టాయి. ఒకేసారి ఇద్దరు హీరోలతో సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయడం.. సంస్థ ధైర్యం ఎలాంటిదో చెప్పవచ్చు.

అయితే టాలీవుడ్ లో విజయ పతాకాన్ని ఎగరవేసిన ఈ సంస్థ నిర్మాతల కన్ను తమిళ హీరోలపై పడింది. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ విక్రమ్ లతో సినిమాలను నిర్మించేందుకు ఈ సంస్థ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ లో పెద్ద హీరోలతో హిట్టు కొట్టిన ఈ సంస్థ.. తమిళ అగ్ర హీరోలతో హిట్టు కొట్టేందుకు మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.

అయితే గత ఏడాది విక్రమ్ పొన్నియాన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. అయితే తెలుగులో అంతగా ఆడలేదు. ప్రస్తుతం ఈ సినిమాకి పార్ట్ 2 తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది

ఇక అజిత్ సంక్రాంతికి తునివు సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ అయింది. తమిళంలో బాగానే ఆడిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆకట్టుకోలేదు. దానికి తోడు తెలుగులో బాలయ్య చిరంజీవి సినిమాలు బరిలో ఉండడంతో తెగింపు ఆకట్టుకోలేకపోయింది. ఏది ఏమైనా మైత్రి మూవీ మేకర్ సంస్థ తమిళ హీరోలపై కన్నేయడంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.