Begin typing your search above and press return to search.

పైకి మాత్ర‌మే నార్మ‌ల్ ప్రైజ్ అంటున్నారా?

By:  Tupaki Desk   |   23 May 2022 9:30 AM GMT
పైకి మాత్ర‌మే నార్మ‌ల్ ప్రైజ్ అంటున్నారా?
X
ఇటీవ‌ల భారీ చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్ బ్యాక్ టు బ్యాక్ థియేట‌ర్ల‌లో సంత‌ద‌డి చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టికెట్ రేట్ల‌ని భారీగా పెంచుకునే వెలుసు బాటుని క‌లిగించ‌మ‌ని ఆయ సినిమాల నిర్మాత‌లు ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ని కోర‌టంతో భారీ చిత్రాల‌కు టికెట్ రేట్లు సినిమా బ‌డ్జెట్ ని బ‌ట్టి మూడు లేదా నాలుగు రోజుల పాలు పెంచుకునే వెసులు బాటుని క‌ల్పిస్తూ ఉభ‌య తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌త్యేక జీవోల‌ని జారీ చేశాయి. దీంతో స‌గ‌టు ప్రేక్ష‌కుడికి సినిమా భారంగా మారిపోయింది.

ఒక్క మూవీ టికెట్ దాదాపు ట్యాక్స్ లు అన్నీ క‌లుపుకుని రూ.400 వ‌ర‌కు మించి పోతుండ‌టంతో స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఫ్యామిలీస్ తో థియేట‌ర్ల‌కు రావ‌డానికి భ‌య‌ప‌డుతున్నాడు. పెంచిన టికెట్ ధ‌ర‌ల‌తో ఫ్యామిలీతో సినిమాకి రావాలంటే ఒక్కో ఫ్యామిలీకి ఖ‌ర్చు రూ. 2000 దాటుతోంది. దంఈఓత చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కులు ఫ్యామిలీస్ లో సినిమా థియేట‌ర్లకు రావ‌డానికి ఆస‌క్తిని చూపించ‌డం లేదు.

దీంతో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు తాను నిర్మించిన `ఎఫ్ 3` మే 27న విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో మా సినిమాకు టెకెట్ రేట్లు పెంచ‌డం లేద‌ని, సాధార‌ణ టికెట్ రేట్ల‌కు మా సినిమా అందుబాటులో వుంటుంద‌ని ప్ర‌క‌టించారు.

ఇదే మెయిన్ అజెండాగా సినిమాకు ప్ర‌మోష‌న్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఆయ‌న చెప్పిన దానికి క్షేత్ర స్థాయిలో వున్న ప‌రిస్థితికి చాలా తేడా క‌నిపిస్తోంది. మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో టికెట్ ధ‌ర రూ. 295 ట్యాక్స్ ల‌న్నీక‌లిపితే రూ. 321 దాటుతోంది. ఇది సాధార‌ణ ప్నేక్ష‌కుడికి నార్మ‌ల్ ప్రైజ్ అన‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం?. ఇక సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేట్ రూ. 175 వుంటోంది. దీనికి ట్యాక్స్ క‌లిపితే మ‌రింత అద‌నం అవుతోంది. ఇంత ఖ‌ర్చు పెట్టి సాధార‌ణ ప్రేక్ష‌కుడు సినిమా చూస్తాడ‌న్న‌ది క‌లే.

లార్జ‌ర్ దెన్ లైఫ్ మూవీస్ కి మాత్ర‌మే ఈ స్థాయిలో ఖ‌ర్చు చేసి థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చూడాల‌ని ప్రేక్ష‌కులు కోరుకుంటారు. ప్ర‌తీ సినిమాక ఇదే స్థాయిలో ఖ‌ర్చ చేయాలంటే ఏ ఏడాదికో ఆరు లేదా మూడు నెల‌ల‌కొక సారి మాత్ర‌మే ప్రేక్ష‌కుడు థియేట‌ర్ కు వ‌చ్చే ప‌రిస్థితి వుంది. ఈ రేంజ్ లో టికెట్ రేట్ల‌ని బాదుతూ కూడా నార్మ‌ల్ రేట్ల‌కే మా సినిమా అని దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూస‌ర్ ప్ర‌క‌టించ‌డం హాస్యాస్ప‌దంగా వుంద‌ని ప్రేక్ష‌కులు కామెంట్ లు చేస్తున్నారు.

టికెట్ ప్రైజ్ హైక్ పేరుతో సాధార‌ణ సినిమాలు కూడా సామాన్యుడిపై భారం మోపితే థియేట‌ర్ల‌లో సినిమాకు ప్రేక్ష‌కులు క‌రువు మొద‌ల‌య్యే ప్ర‌మాదం వుంది. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఇండ‌స్ట్రీని టికెట్ హైక్ దెబ్బ‌తో మ‌రింత‌గా ప‌త‌నావ‌స్థ‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు మానితే బాగుంటుంద‌ని, అప్పుడే ప్రేక్ష‌కులు మ‌రింత‌గా థియేట‌ర్ల‌కు వ‌చ్చే అవ‌కాశం వుంటుంద‌ని కామెంట్ లు వినిపిస్తున్నాయి.