గతాన్ని తలచి ఉద్వేగానికి గురైన MB

Fri Sep 24 2021 09:04:19 GMT+0530 (IST)

mohan babu who is passionate about the past

ఎంత గొప్ప వాళ్లు అయినా వారికి కూడా ఒక గతం ఉంటుంది. ఆ గతాన్ని నెమరు వేసుకునే క్రమంలో ఉద్వేగాలు తప్పవు. ఇప్పుడు అలాంటి ఉద్వేగానికే గురయ్యారు మోహన్ బాబు. అలీతో సరదాగా కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ గతాన్ని తలచి ఎమోషన్ అయిన తీరు అభిమానుల్లో చర్చకు వచ్చింది.``గతాన్ని నెమరువేసుకుంటే తెలియని దుఃఖం వస్తుంది.. నేను ఎంత రఫ్ గా కనిపిస్తానో అంతకంటే చాలా సున్నితం.. ఏదీ తట్టుకోలేను`` అంటూ ఎమోషనల్ అయ్యారు. అలీతో సరదాగా ప్రోమోలో ఈ విషయం వెల్లడైంది. పూర్తి చిట్ చాట్ లో అలీ ఇంకా అభిమానులకు తెలియని ఎన్నో విషయాల్ని కూపీ లాగుతారనడంలో సందేహమేం లేదు.

జీవితంలో ఎన్నో సంఘటనలు .. కెరీర్ వ్యవహారాలు.. కుటుంబ పరంగా స్నేహాలు బంధుమిత్రుల్లో ఉండే ఎన్నో ఎన్నో వెతలు ఇతరత్రా ఉంటాయి. అవన్నీ స్ఫురణకు వస్తే ఎవరికైనా ఎమోషన్ అనేది తప్పనిసరి.

భక్తవత్సలం నాయుడు అనేది మోహన్ బాబు అసలు పేరు. మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్- మోదుగుల పాలెం నుంచి భక్తవత్సలం నాయుడు అలియాస్ మోహన్ బాబు మద్రాసుకు పయనమయ్యారు. నాటి రోజులు వేరు. పేదరికం వేరు. మోహన్ బాబు మద్రాస్ ఫిలింఇనిస్టిట్యూట్ (వైయమ్‌సీఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ & ఆర్ట్స్ కాలేజ్)లో నటవిద్యను అభ్యసించి అటుపై దాసరి అండదండలతో నటుడిగా కెరీర్ ని సాగించారు. ఆ క్రమంలోనే తల్లిదండ్రులు మంచు నారాయణస్వామి- లక్ష్మమ్మ అండదండలు తన ఎదుగుదలకు సహకరించాయి.