తేజ్ ను పరామర్శించిన మంచు వారు ఏమన్నారంటే..!

Tue Sep 14 2021 10:03:13 GMT+0530 (IST)

mohan babu about Sai dharam tej

బైక్ యాక్సిడెంట్ లో గాయాలు అయ్యి ప్రస్తుతం అపోలోలో చికిత్స పొందుతున్న మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ను మంచు మోహన్ బాబు మరియు ఆయన కుమార్తె మంచు లక్ష్మిలు పరామర్శించారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఇంతకు ముందే మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు సాయి ధరమ్ తేజ్ ను పరామర్శిస్తున్నారు. తాజాగా మంచు వారు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆశించారు. చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ను ఆసుపత్రి లోపల పరామర్శించి.. మెగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మంచు మోహన్ బాబు ఆ తర్వాత ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు. ఆ సందర్బంగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం వెంటనే బాగు పడాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.ఇంకా మోహన్ బాబు మాట్లాడుతూ.. తేజ్ ను చూశాను. ఆ సాయి బాబా ఆశీస్సులతో తేజ్ ఆరోగ్యం మెరుగు పడుతోంది. రెండు మూడు రోజుల్లోనే అతడి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడి బయటకు వస్తాడనే నమ్మకం ఉంది. చాలా మంచి కుర్రాడు అంటూ మోహన్ బాబు పేర్కొన్నారు. మోహన్ బాబు ఆ తర్వాత లక్ష్మితో కలిసి అక్కడ నుండి వెళ్లి పోయారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య విషయం పై మెగా అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. ఆయన ట్రీట్‌మెంట్ కు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా స్పీడ్ గా రికవరీ అవుతున్నారు అంటూ వైధ్యులు పేర్కొంటున్నారు.

ప్రతి రోజు అపోలో వైధ్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తూ సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి పుకార్లు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడుతున్నారు. మెగా ఫ్యామిలీ కూడా సాయి ధరమ్ తేజ్ పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నారు. చిత్ర రంగంకు చెందిన పలువురు ప్రముఖులు మరియు సాయి ధరమ్ తేజ్ సన్నిహితులు మిత్రులు అంతా కూడా ఎప్పటికప్పుడు ఆయన్ను పరామర్శిస్తూ ఉన్నారు. మెగా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారంలోనే సాయి ధరమ్ తేజ్ ఇంటికి వచ్చేసే అవకాశం ఉందట. ఆయన నటించిన రిపబ్లిక్ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. కనుక ఆ సినిమా విడుదల విషయమై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. దర్శకుడు దేవా కట్టా నిర్ణయం ఏంటీ అనేది చూడాల్సి ఉంది.