Begin typing your search above and press return to search.

'మిస్ ఇండియా' vs 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య'

By:  Tupaki Desk   |   9 April 2020 7:30 AM GMT
మిస్ ఇండియా vs ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య
X
కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన దేశంలో కూడా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. మన తెలుగు రాష్టాల్లో కుడా పోటాపోటీ కేసులు - మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీ పై కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. సమ్మర్ వస్తే చాలు కొత్త కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడిపోతుంటాయి. అలాంటిది కరోనా వైరస్ గత రెండు వారాలుగా థియేటర్లను మూసి ఉంచేలా చేసింది. చాలా సినిమాలు కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోయి విడుదలకు నోచుకోకుండా ఉన్నాయి. వాటిలో క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ తమ విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. రేపు లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వరుస పెట్టి సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.

ఇప్పటికే ఏ చిత్రాలను ముందు బయటకి వదలాలి అనేదాని మీద చిత్ర నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నాని నటించిన 'వి' - అనుష్క 'నిశ్శబ్దం' - రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' - యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏవి ముందుగా రిలీజ్ అవుతాయో తెలియాల్సి ఉంది. వీటితో పాటు కీర్తి సురేష్ 'మిస్ ఇండియా' - సత్యదేవ్ 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' - నాగచైతన్య 'లవ్ స్టోరీ' - అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బాచ్యులర్' - మెగా హీరో 'ఉప్పెన' సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.

అయితే వీటిలో 'మిస్ ఇండియా' 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు ఒకే డేట్ కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. 'మిస్ ఇండియా' సినిమాను మహేష్ కోనేరు నిర్మిస్తుండగా నరేంద్రనాథ్ తరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కేవలం కీర్తి సురేష్ క్రేజ్ నమ్ముకొనే విడుదల కాబోతోంది. అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్ 'మహానటి' ద్వారా దేశవ్యాప్త క్రేజ్ సంపాదించుకున్న కీర్తి సురేష్ గుర్తింపు తప్పితే ఈ సినిమాకు ఎలాంటి ఫేమ్ లేదు. అస్సలు ఇలాంటి మూవీ ఒకటి ఉందన్నట్లు కూడా చాలా మందికి తెలియదు.

మరోవైపు సత్యదేవ్ లాంటి క్యారక్టర్ ఆర్టిస్ట్ ముఖ్యపాత్రలో నటిస్తున్న 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' పరిస్థితి కూడా అంతే. ఈ సినిమాను 'బాహుబలి' నిర్మాతలు ఆర్కా మీడియా వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన 'మహేషింటే ప్రతీకారమ్' చిత్రానికి రీమేక్. కేవలం ఆర్కా మీడియా వాళ్ళ గత చిత్రాల క్రేజ్ తప్పితే ఈ సినిమాకు కూడా పెద్దగా ఫేమ్ లేదు. అందులోనూ అప్పుడు అక్కడ రాజమౌళి ఉన్నాడు కాబట్టి అలా నడిచింది. మరి ఇప్పుడు ఈ సినిమా విషయంలో రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేము. దాదాపు ఈ రెండు సినిమాల పొజిషన్ ఒకటే అని చెప్పొచ్చు. కానీ కంపేర్ చేసి చూస్తే మాత్రం కీర్తి సురేష్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. మరి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత రాబోయే క్లాసిక్ సినిమాలు కావడంతో జనాలు ఈ రెండిట్లో ఏ సినిమాకి ఓటేస్తారో చూడాలి. మంచి చిత్రాలను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు రెండింటికి ఓటు వేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.