Begin typing your search above and press return to search.

తమన్ ను తిడుతున్నా.. మెగాస్టార్ లేపుతున్నారే?

By:  Tupaki Desk   |   23 Sep 2022 11:30 PM GMT
తమన్ ను తిడుతున్నా.. మెగాస్టార్ లేపుతున్నారే?
X
సంగీత దర్శకుడు థమన్ ఇటీవల కాలంలో చాలా మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు అని అనేలోపే మళ్ళీ ఏదో ఒక కాఫీ సాంగ్ తో సోషల్ మీడియాలో దొరికిపోతూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక రీసెంట్గా గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి రెండుసార్లు తమన్ పై మెగా అభిమానులు అప్సెట్ అవుతూ ఉండడం కూడా వైరల్ గా మారింది.

ముఖ్యంగా సినిమాకు సంబంధించిన టీజర్ అలా విడుదల చేశారో లేదో.. గని సినిమాలోని ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అటు ఇటుగా మార్చేసి దింపేసినట్లుగా ఉందని తమన్ పై మెగా అభిమానులు విరుచుకుపడ్డారు.

అసలే సినిమాకు మెగా లెవెల్లో హైప్ లేదు. అంతేకాకుండా ఇది లూసిఫర్ సినిమాకు రీమేక్ కాబట్టి ఓ వర్గం ఆడియన్స్ ఇందులో కొత్తగా ఏం ఉందనే కామెంట్ చేస్తుండడం అనేది మేజర్ మైనస్ పాయింట్. అయితే ఎక్కువగా గని సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తీసుకువచ్చే గాడ్ ఫాదర్ టీజర్ లో కలిపేయడంతో తమన్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అంతేకాకుండా రీసెంట్ గా వచ్చిన తార్ మార్ తక్కర్ మార్ అనే పాటపై కూడా కాపీ అనే కామెంట్స్ చాలా వినిపించాయి.

అయితే ఈ తరుణంలో తమన్ పై మెగాస్టార్ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం ఊహలకు అందని రేంజ్ లో ఉంది. రీసెంట్ గా ఆయన శ్రీముఖితో చేసిన ఇంటర్వ్యూ కు సంబంధించిన ప్రోమోలో అయితే ఈ సినిమాకు తమన్ ఆరో ప్రాణంగా నిలిచి సినిమాను 100% కంటే పై స్థాయికి తీసుకువెళ్లాడు అని చెప్పడం హైలైట్ గా నిలిచింది. ఒకవైపు మెగా అభిమానులు తమన్ చేసిన మిస్టేక్స్ కారణంగా గాడ్ ఫాదర్ సినిమా స్థాయి మళ్ళీ మరింత కిందకు జారిపోయింది అని కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ తరుణంలో మెగాస్టార్ మాత్రం తమన్ పై నమ్మకంగా ఉన్నారు అంటే సినిమా లోపల ఇంకేదో చేసి ఉంటాడు అని కూడా అనిపిస్తోంది. కానీ ఆచార్య సినిమా ప్రభావం వలన మెగాస్టార్ ఇప్పుడు చెబుతున్న మాటలను.. సినిమా చూసిన తర్వాత గాని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది.

అందులోనూ ఇది లూసిఫర్ రీమేక్ అనగానే కొత్తగా అంచనాలు పెద్దగా లేవు. కాస్త అటు ఇటుగా డైరెక్టర్ మోహన్ రాజా మీదే ఓవర్గం ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది ఊహించడం కష్టం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.