జెట్ స్పీడ్ లో మాస్ రాజా.. మరొకటి రెడీ

Tue Jan 24 2023 09:05:20 GMT+0530 (India Standard Time)

mass maharaja ravi teja movie update

రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రావణాసుర. ఇటీవలే ధమాకా వంటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఆయన సోదరుడు పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో ఆయన చనిపోయే పాత్ర అయినా సినిమా మొత్తాన్ని మలుపు తిప్పిన పాత్రగా మంచి పేరు వచ్చింది. అంతేకాక మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడమే కాక ఇద్దరు ఎనర్జీ చూసి ప్రేక్షకులకు కూడా పునకాలు వచ్చేస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి రవితేజ రావణాసుర సినిమా షూటింగ్లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల ప్రచారం జరుగుతుంది. ఇంకా రెండు పాటల షూటింగ్ పూర్తి చేస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి అత్తాపూర్ మాల్ లో కూడా ఒక పాట షూట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాని సుధీర్ వర్మ తెరకెక్కిస్తూ ఉండగా రవితేజ సరసన అను ఇమ్మానియేల్ మేఘ ఆకాష్ ఫరియా అబ్దుల్లా దక్ష పూజిత పొన్నాడ వంటి ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ ఏడవ తేదీన విడుదల చేస్తామని ప్రకటించడంతో వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమాని విడుదల చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పని మొదలుపెట్టి వీలైనంత త్వరగా ఫైనల్ గా సిద్ధం చేయాలని నిర్మాతలు కోరినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాకి నిర్మాతలుగా రవితేజ తో పాటు అభిషేక్ నామా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో కూడా రవితేజ హిట్ కొడతాడని ఆయన అభిమానులైతే భావిస్తున్నారు బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల సినిమాలతో రవితేజ క్రేజ్ మరోసారి టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా చర్చ నియాంశమవుతుందని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.