పేర్లు బయటకు వచ్చాయంటే అందరి పరువు పోతుంది: మంచు విష్ణు

Thu Sep 29 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

manchu vishnu comments

మంచు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై హీరో విష్ణు మంచు మరోసారి స్పందించారు. ఈ క్రమంలో టాలీవుడ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ అంతా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలా ఉండేదని.. కానీ ఇప్పుడు ఎక్కువ మంది బయటవాళ్ళు రావడం - మీడియా పెరగడం వల్ల ఎథిక్స్ ఎంతవరకు ఉన్నాయనేది చర్చనీయాంశంగా మారిందని అన్నారు.'జిన్నా' ప్రమోషన్స్ లో భాగంగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ.. ట్రోలింగ్ అనేది జనరల్ ట్రెండ్. ఇప్పుడనే కాదు.. 80స్ లో సినిమా మ్యాగజైన్స్ లో రూమర్స్ రాసేవారు. అది పేపర్ అమ్మకానికి కొంతవరకూ ఉపయోగపడేది. కానీ ఇప్పుడు లైన్ దాటుతున్నారు. సినీ ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం అని నమ్ముతాం.. ఇండస్ట్రీలో తెర ముందు తెర వెనుక పనిచేసే వారంతా ఒక ఫ్యామిలీ అనుకుంటాం. కానీ ఇప్పుడు అంత హోమ్లీగా లేము'' అని అన్నారు.

''ఒకప్పుడు మేము ఏమన్నా పొరపాటున ఏదైనా మాట్లాడినా సినీ మీడియా దాన్ని ప్రింట్ చేసేవాళ్ళు కాదు. వద్దు.. అలాంటివి రాయడం కరెక్ట్ కాదు అనుకునేవారు. అంత ఉమ్మడిగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కువ మంది బయటవాళ్ళు రావడం - మీడియా పెరగడం వల్ల ఒకప్పుడున్న ఎథిక్స్ ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయనేది డిబేటబుల్ గా ఉంటోంది'' అని విష్ణు తెలిపారు.

''ట్రోలింగ్ పై సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు రెండు ఐపీ అడ్రెస్సులు తెలిసాయి. అందులో ఒకటి జూబ్లీహిల్స్ లోని ఆఫీస్ అడ్రెస్.. రెండోది చెక్ పోస్ట్ దగ్గర ఆఫీస్ అడ్రెస్. ఈ రెండు అడ్రెస్సుల నుంచే ఈ పెయిడ్ బ్యాచ్ ఇలా చేస్తున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ లో ఇలా వీడియోలు షేర్ చేయండి.. కామెంట్స్ చేయండి అంటూ ఇన్స్ట్రుక్షన్స్ ఇస్తున్నారు. వాళ్ళు అలానే చేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్తేనే నాకు తెలిసింది''

''నా మీద వాళ్ళు ఎందుకు ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసి ఇలా చేస్తున్నారు అనేది ఆలోచిస్తే నాకు కామెడీగా ఉంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది తెలియదు. ఈరోజో రేపో కోర్టులో కేసులు నమోదవుతాయి. ఆ 18 యూట్యూబ్ ఛానల్స్ ఏంటనేది ఎఫ్ఐఆర్ కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు మీకు కూడా తెలుస్తాయి. అప్పుడు కేవలం మమ్మల్నే ట్రోల్ చేస్తున్నారా లేదా అందరిని చేస్తున్నారా అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది''

''ఆన్ లైన్ మీడియా అనేది డేంజరస్ వెపన్. కొత్త విషయాలు నేర్చుకునే సాధనంగా ఉపయోగించుకొని జీవితాన్ని మార్చుకోవచ్చు. కానీ దాన్ని ఆయుధంగా మార్చుకుని మాపైకి రావాలని చూస్తున్నారు. ఇదంతా గతేడాది మూవీ ఆర్టిస్ట్స్ ఎన్నికలు జరిగినప్పటి నుంచే ఇవి మొదలయ్యాయి. అంతకుముందు ఎప్పుడూ మీరు ఇవి వినలేదు. ఎన్నికల తర్వాతే వింటున్నారు. కరెక్ట్ గా సినిమా రిలీజులకు ముందే వింటున్నారు. మేమేం మాట్లాడినా దాన్ని ట్విస్ట్ చేసి వింటున్నారు''

''ఇదంతా పెయిడ్ బ్యాచ్.. పైసా వసూల్ బ్యాచ్ పని. వాళ్ళని పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కోర్టుకు వెళ్తున్నాం తప్పితే.. వాళ్ళని ఏమాత్రం లెక్కచేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి పేర్లు బయటకు వచ్చాయంటే వాళ్ళ పరువు పోతుంది. ఒక ప్రముఖ నటుడి ఆఫీస్ ఐపీ అడ్రెస్ నుంచే ఇది జరుగుతోంది. మనమంతా ఒక ఫ్యామిలీ. అందరం కరెక్ట్ గా ఉండం కదా? ఎవరో ఒకరు దారి తప్పుతారు. పెద్దవాళ్లే వాళ్ళకి మొటిక్కాయ వేసి దారిలోకి తీసుకొస్తారు. దారికి రాలేదంటే మనమే వాళ్ళని పక్కకి వెలివేస్తాం'' అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఈ సందర్భంగా విష్ణు తన 'జిన్నా' మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ‘అక్టోబర్ 21న జిన్నా మూవీని రిలీజ్ చేయబోతున్నాం. అక్టోబర్ 5న ట్రైలర్ రిలీజ్ చేస్తాం. నాకు అక్టోబర్ 21 ఎంతో స్పెషల్ డే’ అని తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.