Begin typing your search above and press return to search.

మంచు విష్ణు గాలి తీసేసిన నాని

By:  Tupaki Desk   |   12 Feb 2022 5:01 AM GMT
మంచు విష్ణు గాలి తీసేసిన నాని
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టికెట్ల రేట్ల వ్య‌వ‌హారం ఎట్ట‌కేల‌కు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తోంది. ఈ విష‌యంలో మెగాస్టార్ చిరంజీవి ఎంత చొర‌వ తీసుకుని స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేసిన విష‌యం తెలిసిందే.

ఐతే మ‌ధ్య‌లో ఆయ‌న స్థాయిని, గౌర‌వాన్ని త‌గ్గించ‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నించ‌డ‌మూ విదిత‌మే. స్వ‌యంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు.. చిరు వ్య‌క్తిగ‌తంగా వెళ్లి ఏపీ ముఖ్య‌మంత్రిని క‌లుస్తున్నాడ‌ని.. అది వ్య‌క్తిగ‌త స‌మావేశం అవుతుంద‌ని వ్యాఖ్యానించ‌డం తెలిసిందే. క‌ట్ చేస్తే చివ‌రికి చిరుతో పాటు మ‌హేష్‌, ప్ర‌భాస్, రాజ‌మౌళి, కొర‌టాల శివ లాంటి ప్ర‌ముఖులు వెళ్లి ఏపీ సీఎంను క‌లిశారు. స‌మ‌స్య ఒక కొలిక్కి వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో మంచు విష్ణు ఎక్క‌డ అంటూ సోష‌ల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు నెటిజ‌న్లు. దీనికి దీటుగా బ‌దులివ్వ‌బోయి మ‌ళ్లీ ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు విష్ణు.

చిరు అండ్ కో ఏపీ ముఖ్య‌మంత్రిని క‌లిసిన మ‌రుస‌టి రోజే.. మంచు వారింటికి ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని వెళ్లి క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మంత్రిని మంచు వారు ఇంటికే ర‌ప్పించుకున్నారే అంటూ అంతా మాట్లాడుకున్నారు.

నాని వ‌చ్చి త‌మ‌కు టికెట్ల ఇష్యూ గురించి అప్ డేట్స్ ఇచ్చిన‌ట్లుగా విష్ణు కూడా ట్వీట్ వేయ‌డం తెలిసిందే. కానీ ఇది జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే క‌థ మారిపోయింది. మంత్రి వెళ్లి మంచు ఫ్యామిలీకి వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడంటూ ఆయ‌న్ని ట్రోల్ చేయ‌డం మొదలుపెట్టారు నెటిజ‌న్లు. మీడియాలో కూడా దీని గురించి నెగెటివ్ వార్త‌లు రావ‌డంతో నాని స్పందించారు. మీడియా ముందుకొచ్చి మోహ‌న్ బాబు, విష్ణు కాఫీకి రమ్మంటేనే వెళ్లి వారిని క‌లిశాన‌న్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ తాము ఎవ‌రికీ వివ‌ర‌ణ లేదా సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. మీడియాలో ఇలా వార్త‌లొస్తున్నాయేంటి అని విష్ణుతో తాను మాట్లాడ‌గా తాను ట్వీట్ డెలీట్ చేసి వేరే ట్వీట్ వేసిన‌ట్లు విష్ణు చెప్పాడ‌ని నాని వివ‌రించారు. నాని అన్న‌ట్లే విష్ణు కొన్ని గంట‌ల్లోనే పాత ట్వీట్‌ను డెలీట్ చేసి మంత్రికి ఆతిథ్య‌మివ్వ‌డం సంతోష‌మ‌ని, ఇండ‌స్ట్రీ బాగు కోసం కృషి చేస్తున్న ఆయ‌న‌కు కృతజ్ఞ‌త‌ల‌ని విష్ణు కొత్త ట్వీట్ వేయ‌డం విశేషం. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో నాని మంచు విష్ణు గాలి తీసేశాడ‌న్న అభిప్రాయాలు జ‌నాల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి.