మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్!

Wed Aug 10 2022 21:00:01 GMT+0530 (IST)

macherla niyojakavargam Box Office Target Fix

యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా శుక్రవారం రోజు గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. నితిన్ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని ఎదురుచూస్తున్నాడు.ఎందుకంటే అతని గత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. భీష్మ సినిమా తర్వాత నితిన్ సరైన సక్సెస్ చూడలేదు. ఆ తర్వాత చెక్ దారుణంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ వెంటనే వచ్చిన రంగ్ దే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద టార్గెట్ పూర్తి చేయకుండానే మాయమైపోయింది.

ఆ రెండు సినిమాలతో కమర్షియల్ గా నష్టాలు ఎదుర్కొన్న నితిన్ ఇప్పుడు మాత్రం మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని అనుకుంటున్నాడు. ఇక ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ చేసింది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంత వస్తే సక్సెస్ అయినట్లు లెక్క అనే వివరాల్లోకి వెళితే.. మాచర్ల నియోజకవర్గం సినిమా నైజాం ఏరియాలో 6 కోట్ల ధరకు అమ్ముడవగా సీడెడ్ లో 3 కోట్లు ఆంధ్రాలో 10 కోట్లు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 19 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో టోటల్ గా ఒక కోటి వరకు బిజినెస్ చేసిన మాచర్ల ఓవర్సీస్ లో కోటి 20 లక్షల రేటుకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. ఇక టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం సినిమా  21.20 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రంగంలోకి దిగుతుంది.

ఒక విధంగా ఈ సినిమాకు హై రేంజ్ లో టాక్ వస్తే గాని సక్సెస్ కావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే పోటీగా ఆ తర్వాత రోజే కార్తికేయ 2 సినిమా ఉంది. ఆ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. అంతకుముందు లాల్ సింగ్ చడ్డా సినిమా వస్తోంది.

ఇక ఇదివరకే వచ్చిన బింబిసారా సీతారామం పాజిటివ్ టాక్ తో ఈ వీకెండ్ కూడా పోటీని ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి మాస్ కమర్షియల్ మూవీగా వస్తున్న మాచర్ల నియోజకవర్గం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేస్తుందో లేదో చూడాలి.